Anil Ravipudi: అతి తక్కువ సమయం లో ఒక సూపర్ హిట్ సినిమాని, ఇండస్ట్రీ ని షేక్ చేసే సినిమాని తీయడం ఎలా? కోర్స్ పెడితే డైరెక్టర్ రాజమౌళి లాంటోళ్ళు కూడా అనిల్ రావిపూడి(Anil Ravipudi) వద్ద స్టూడెంట్స్ గా చేరాలేమో. కేవలం మూడు నెలల్లో సినిమాని చుట్టేసి, సంక్రాంతికి రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తాన్ని థియేటర్స్ కి క్యూలు కట్టేలా చేయడం, భారీ బ్లాక్ బస్టర్ ని జోబులో వేసుకొని వెళ్లడం, ఇదే అనిల్ రావిపూడి రొటీన్ హాబీ. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ విజయాన్ని అందుకొని, 300 కోట్లు కొల్లగొట్టిన అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) ద్వారా ఏకంగా 400 కోట్ల గ్రాస్ పై కన్నేశాడు. అయితే భారీ హిట్ అందుకున్న తర్వాత నిన్న ఆయన మొట్టమొదటి సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు.
ఈ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నేను ఒక స్క్రిప్ట్ ని డైలాగ్ వెర్షన్ తో సహా రాసుకోవడానికి మూడు నెలలు తీసుకుంటాను. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ సమయమే తీసుకున్నాను కూడా. కానీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి నేను స్క్రిప్ట్ ని పూర్తి చేయడానికి కేవలం 25 రోజుల సమయం మాత్రమే తీసుకున్నాను. మొదటి 15 రోజులు ఫస్ట్ హాఫ్, మిగిలిన 10 రోజులు సెకండ్ హాఫ్ కోసం తీసుకున్నాను. నా కెరీర్ మొత్తం మీద ఇంత వేగంగా స్క్రిప్ట్ రాయడం ఈ చిత్రానికే జరిగింది. అలా అవ్వడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారే. రాసేటప్పుడు చిరంజీవి ఎలా మొదలు పెట్టాలి, ఎలా మూమెంట్స్ క్రియేట్ చెయ్యాలి , ఎలా ముగించాలి అనేది అనుకుంటే, దానికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారే’.
‘డైలాగ్ ని చాలా కూల్ గా, క్యాజువల్ బాడీ లాంగ్వేజ్ తో మాట్లాడాలంటే దానికి ప్రేరణ ఇచ్చింది చిరంజీవి, ఒక బాధ ని, ఒక ఎమోషన్ ని, కంటి నుండి బయటకు కన్నీళ్లు రానివ్వకుండా, కేవలం ఎక్స్ ప్రెషన్స్ తో మన అందరికీ కంటతడి పెట్టించాలంటే , అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యం. ఇలా ఆయన పాత సినిమాలే నన్ను ఈ స్క్రిప్ట్ ని రాయించేలా చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే చూడండి ఈ క్రింది వీడియోలో. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో చిరంజీవి రాలేదు కానీ, త్వరలోనే ఏర్పాటు చేయబోయే విజయోత్సవ సభలో మాత్రం చిరంజీవి పాల్గొంటాడని తెలుస్తోంది.
