Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు… ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెసులు గా నిలవడంతో 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న దర్శకుడిగా గొప్ప గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆయన తన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేయాలి అనే విషయంలో చాలావరకు కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతని లిస్టులో ఇప్పటికే చాలామంది హీరోలు ఉన్నారు. ముఖ్యంగా నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్, బాలయ్య, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సైతం అతని లిస్టులో ఉన్నారు…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లు సాధించిన కూడా అనిల్ రావిపూడి సాధించిన విజయాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎందుకంటే అతను పండక్కి ఫ్యామిలీ సబ్జెక్టుతో వచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటాడు… ఆయనతో సినిమా చేస్తే డెఫినెట్ గా సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్క హీరో కూడా అతనితో ఒక్క సినిమా అయిన చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరి కొంతమంది మాత్రం అనిల్ రావిపూడి సినిమాలో క్రింజ్ కామెడీ ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నప్పటికి అతని సినిమాలకు సక్సెసు లైతే వస్తున్నాయి. కాబట్టి సక్సెస్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ అయితే ఉంటుంది. మరి ఆ క్రేజ్ ను వాడుకోవడానికి హీరోలు ప్రొడ్యూసర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు.
కానీ తన లిస్టులో మాత్రం చాలా మంది హీరోలైతే ఉన్నారు. మరి వాళ్ళలో అతను ఎవరికీ ఓటు వేస్తాడు ఎవరితో సినిమా చేసి 2027 సంక్రాంతి బరిలో ఆ సినిమాను నిలుపుతాడు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సంక్రాంతికి చిరంజీవి తో చేసిన మన శంకర్ వరప్రసాద్ ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతుండటం విశేషం…