Anil Ravipudi Chiranjeevi Movie Update : ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై మెగా అభిమానుల్లో ఎలాంటి క్లారిటీ లేదు కానీ, అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అనే క్లారిటీ మాత్రం ఉంది. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ చిత్రం అనిల్ రావిపూడి కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా పూర్తి అయ్యే సినిమాగా నిలవబోతుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటే కేవలం ఆరు రోజుల్లోనే ఆ షెడ్యూల్ ని పూర్తి చేసి పెట్టాడట అనిల్ రావిపూడి. ఆయన మేకింగ్ స్టైల్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి ఎంతో నచ్చిందట. నిర్మాత బడ్జెట్ ని సేవ్ చేసినందుకు అనిల్ రావిపూడి పై లొకేషన్ సెట్స్ లో ప్రశంసల వర్షం కురిపించాడట.
Also Read : ‘అర్జున్ రెడ్డి’ ని వదులుకోవడానికి కారణం అదేనంటూ మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!
అనిల్ రావిపూడి స్పీడ్ చూస్తుంటే కేవలం మూడు నెలల లోపే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం ముగించేసేలా ఉన్నాడు. సాధారణంగా అనిల్ సినిమాలన్నీ ఇదే రేంజ్ స్పీడ్ లో పూర్తి అవుతుంటాయి. ఈ చిత్రం వాటికంటే వేగంగా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని ఒక్కసారి బయటకి తీసుకొస్తే ఇప్పటి తరం స్టార్ హీరోలు కూడా తట్టుకోలేరు అనేది మెగా అభిమానులతో పాటు విశ్లేషకుల అభిప్రాయం కూడా. రీ ఎంట్రీ తర్వాత వింటేజ్ మెగాస్టార్ ని ఎవ్వరూ బయటకి తీసుకొని రాలేకపోయారు. ఆయనలోని కామెడీ టైమింగ్, మెగాస్టార్ మార్క్ మాస్ హీరోయిజం ని ఇష్టపడని మనిషి ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు అనిల్ రావిపూడి వింటేజ్ మెగాస్టార్ ని బయటకి తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి పాత్ర ని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు. తన సినిమాలో అలాంటి మెగాస్టార్ ని బయటకి తీసుకొని రాబోతున్నాడట.
అంటే చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ ని చూపిస్తూనే, గతం లో ఆయన హీరోయిజం ఎలా ఉండేదో దానిని మరోసారి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇకపోతే ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాధారణంగా ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడని నయనతార ఈ చిత్రంలో అడుగుపెట్టడమే ప్రమోషనల్ వీడియో తో అడుగుపెట్టింది. ఆ వీడియో సోషల్ మీడియా లో ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతే కాదు ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపిస్తాడట. దాదాపుగా సెకండ్ హాఫ్ మొత్తం వెంకీ ఈ చిత్రం లో ఉండబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అన్ని పర్ఫెక్ట్ గా కుదిరితే ఈ చిత్రం తో అనిల్ రావిపూడి ఈసారి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాకి ఇంకా ఎంత బజ్ క్రియేట్ అవుతుంది అనేది.