Anil Ravipudi : టాలీవుడ్ లో అపజయం అనేదే ఎరుగని డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే రాజమౌళి తో పాటు మనకు వినిపించే మరో పేరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). ఇప్పటి వరకు ఈయన తీసిన ప్రతీ సినిమా సక్సెస్ అయ్యింది. రీసెంట్ గా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అయితే మరో లెవెల్ కి వెళ్లి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మెగాస్టార్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని తీసుకొచ్చే బాధ్యతలో అనిల్ ప్రస్తుతం ఫుల్ బిజీ గా ఉన్నాడు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరక్కనుంది. త్వరలోనే షూటింగ్ కి సంబంధించిన అన్ని వివరాలు బయటకు రానున్నాయి.
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన తమన్నా ‘ఓదెల 2’..ఎందులో చూడాలంటే!
ఇదంతా పక్కన పెడితే అనిల్ రావిపూడి ఇది వరకే బాలయ్య బాబు(Nandamuri Balakrishna) తో ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. మొట్టమొదటి సారి ఆయన తన కంఫర్ట్ జోన్ ని వదులుకొని, బాలయ్య స్టైల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఫలితం అదిరిపోయింది. ఇప్పుడు ఈ సినిమాని తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన తలపతి విజయ్ ‘జన నాయగన్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. అయితే త్వరలోనే అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్ లో రెండవ చిత్రం తెరకెక్కబోతుంది. రీసెంట్ గానే వీళ్లిద్దరి మధ్య స్టోరీ విషయం లో పలు చర్చలు జరిగాయి. బాలయ్య ఫిల్మోగ్రఫీ చూస్తే ఆయన కామెడీ జానర్ సినిమాల్లో నటించడం చాలా తక్కువ. అప్పుడెప్పుడో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం లో ‘టాప్ హీరో’ అనే చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడం తో బాలయ్య మళ్ళీ ఆ జానర్ ని ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి బాలయ్య ని ఆ జానర్ లోనే చూపించే ప్రయత్నం చేయబోతున్నాడట. ఒకప్పుడు అంటే ఒక ఇమేజ్ ఉన్న హీరోలు కేవలం అదే తరహా సినిమాలు చేయాలి, లేకపోతే ఫెయిల్ అవ్వడం వంటివి జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేవు, హీరోలను జానర్ తో సంబంధం లేకుండా చూస్తున్నారు ఆడియన్స్. అందుకే అనిల్ రావిపూడి బాలయ్య తో కామెడీ సినిమా చేసే సాహసం చేస్తున్నాడు. ఇది కచ్చితంగా ఒక విన్నూతన ప్రయోగం అనే చెప్పాలి. మరి ఈ ప్రయోగం లో అనిల్ రావిపూడి సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. చిరంజీవి సినిమా పూర్తి అవ్వగానే, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది