Anil Ravipudi And Rajamouli: ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాను చేసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం. ఇప్పటివరకు 12 సినిమాలను చేసి 12 సినిమాలతో గొప్ప విజయాలను అందుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం…100% సక్సెస్ రేట్ కలిగి ఉన్న దర్శకులు ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు… ఇక రాజమౌళి ఇన్స్పిరేషన్ తో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి కూడా మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలిపాడు. త్రిబుల్ హ్యాట్రిక్ సాధించిన దర్శకుడిగా గొప్ప కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకున్నాడు. అలాంటి అనిల్ రావిపూడి ఇప్పుడు తన పదోవ సినిమాను ఏ హీరోతో చేయబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది… అయితే ఇద్దరు దర్శకులు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గొప్ప పేరు సంపాదించుకున్నప్పటికి ఒక్కొక్కరి సినిమా ఒక్కొక్క పంథాలో సాగుతుంది.
రాజమౌళి కొంచెం ఎక్కువ టైమ్ తీసుకొని విజువల్ వండర్ ను తెరకెక్కించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటాడు. ఒక సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించి మరి సినిమాను స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
అలాంటి రాజమౌళి ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తక్కువ సమయంలో తెరకెక్కించి సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ఉంటాడు. రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ సినిమాతో కూడా భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి మరోసారి తన స్ట్రాంగ్ జోన్ అయిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్స్ ను నమ్ముకున్నాడు.
మొత్తానికైతే 9 విజయాలను అందుకున్న దర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇద్దరు దర్శకులు ఫ్యూచర్లో మరిన్ని వండర్స్ ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే కొంతమంది దర్శకులకు రాజమౌళి సినిమాలు నచ్చితే మరి కొంతమందికి అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీకి సక్సెస్ రేట్ అనేది చాలా కీలకం. కాబట్టి ఈ ఇద్దరు దర్శకులు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…
