
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ బాబు-అనిల్ రావిపూడి మూవీ హిట్ కాంబినేషన్ గా పేరొచ్చింది. వీరిద్దరూ కలిసి మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ చేస్తున్న ‘సర్కారి వారి పాట’, ఎఫ్3 షూటింగులు పూర్తికాగానే వీరిద్దరి జోడిలో మరో సినిమా రానుంది. అయితే మహేష్ తో సినిమా కోసం చాలా పోటీ ఉన్నా దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రం ఒక మంచి కథతో మహేష్ బాబును ఒప్పించి సినిమాను ఒకే చేసుకున్నట్టు సమాచారం.
మహేష్ బాబు కోసం అనిల్ రావిపూడి ఈసారి ఒక మంచి కథను తయారు చేసినట్టు సమాచారం. ‘సరిలేరు’లో మహేష్ ను ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన అనిల్ రావిపూడి.. తదిపరి సినిమాలో మహేష్ ను ‘క్రికెట్ కోచ్’గా చూపించబోతున్నాడట..
క్రీడా నేపథ్య చిత్రమిది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కోచ్ పాత్రలో మహేష్ పాత్ర అదిరిపోయిందని.. అనిల్ మార్క్ వినోదం ఇందులో బోలెడు ఉంటందని సమాచారం. మరి సినిమా ఎలా ఉంటుందనేది అనౌన్స్ మెంట్ వరకు వేచిచూడాలి.