Tollywood: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల థియేటర్ టికెట్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును ఆమోదం కూడా చేశారు. ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి ఏపీ సినిమా హాళ్లలో కేవలం నాలుగు షో లే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని ఆదేశించారు. అదనపు షోలకు అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యం లోనే ఆన్లైన్ టికెట్ విధానానికి మొగ్గుచూపింది సర్కార్. ఈ మేరకు ఇప్పటికే చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలతో చర్చలు జరిపింది జగన్ సర్కార్.
అయితే తాజాగా టికెట్ల ధరలను ప్రభుత్వమే విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, నగర పంచాయితీ ఏరియా, గ్రామ పంచాయతీ ఏరియాల వారీగా టికెట్ల ధరలను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ టికెట్ల ధరలను ఫైనల్ చేస్తూ జీవో కూడా జారీ చేసింది. ప్రతిరోజు కేవలం నాలుగు షోలు మాత్రమే నిర్వహించాలని… ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే ఇక నుంచి సినిమా టికెట్లు అమ్మనున్నట్టు జీవోలో పేర్కొంది. ఇక నుంచి టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకోవాలని పేర్కొంది ప్రభుత్వం. కాగా టిక్కెట్ల ధరలను పెంచాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ కూడా టికెట్ల రేటు విషయంలో పునరాలోచించాలని కోరారు.
Ticket prices – FIXED rates issued by AP Govt.
To be followed strictly with only 4 shows per day even for BIG releases from today. pic.twitter.com/9kqidbZ4SN
— Manobala Vijayabalan (@ManobalaV) December 1, 2021