Andhra King Taluka Trailer: ఇన్ని రోజులు మనం ఒక సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్స్ ని యూట్యూబ్ లేదా సినిమా థియేటర్స్ లో మాత్రమే చూసేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారి ఒక సినిమా ట్రైలర్ ని ఆకాశంలో చూడబోతున్నాం. అవును మీరు వింటున్నది నిజమే. రామ్ పోతినేని(Ram Pothineni) లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Movie) ట్రైలర్ ని ఈ రీతిలో కొత్తగా విడుదల చేయబోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈమధ్య కాలం లో ధ్రోన్ షోస్ ఎక్కువ అయిపోయాయి. ఇష్టమైన వాళ్లకు పుట్టిన రోజు శుభాకాంక్షలు కానీ,మరియు ఇతర సందర్భాల్లో సర్ప్రైజ్ కి గురి చేసే విషయం లో కానీ ధ్రోన్ షోస్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు తొలిసారి ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని చేయబోతున్నారు. ధ్రోన్ షో ద్వారా ఆకాశం లోనే ట్రైలర్ ని లాంచ్ అయ్యేలా చేస్తారట. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎప్పుడూ ఇలా జరగలేదు.
ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళ్తే ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఆడియన్స్ కి అందించిన మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఒక సూపర్ స్టార్ వీరాభిమాని బయోపిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. ఇందులో సూపర్ స్టార్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కనిపించబోతున్నాడు. వాస్తవానికి ఈ క్యారక్టర్ కోసం నందమూరి బాలకృష్ణ ని సంప్రదించారట. ఆయన ఒప్పుకోకపోవడం తో ఉపేంద్ర ఈ చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. మేకర్స్ గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేసారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ చిత్రం లో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘నువ్వెంటే చాలే’ పాటని యూత్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో కూడా లక్షల సంఖ్యలో ఈ పాటపై రీల్స్ వస్తున్నాయి. ఈమధ్య కాలం లో రామ్ సినిమా పాటకు ఇంత రీచ్ రావడం ఈ చిత్రానికే జరిగింది. అన్ని విధాలుగా పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫ్లాపుల్లో ఉన్న రామ్ ని బయటకు తీసుకొస్తుందా లేదా అనేది చూడాలి.