Kaantha Box Office Collection: ‘లక్కీ భాస్కర్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత దుల్కర్ సల్మాన్(Dulquer Salman) చేసిన చిత్రం ‘కాంతా'(Kantha Movie). రానా దగ్గుబాటి(Rana Daggubati) నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు,తమిళం, హిందీ భాషలతో పాటు మలయాళం భాషలో కూడా విడుదలైంది. మొదటి ఆట నుండే ఈ చిత్రం యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. బుక్ మై షో యాప్ లో కూడా రేటింగ్స్ బాగా పడిపోయాయి. ఫలితంగా ఈ చిత్రానికి యావరేజ్ రేంజ్ ఓపెనింగ్స్ మాత్రమే దక్కాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ నటుడు/ సింగర్ త్యాగరాజ భగవతార్ జీవిత చరిత్ర ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనేక చోట్ల ల్యాగ్ ఉండడం, చూసే ఆడియన్స్ కి ఇది సినిమా లాగా కాకుండా, ఒక స్టేజి షో లాగా అనిపించడం వల్ల టాక్ ఆశించిన స్థాయిలో రాలేదు.
ఇక బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు మూడు వేల టిక్కెట్లు మాత్రమే నూన్ షోస్ సమయం లో అమ్ముడుపోయాయి. ఇక మాట్నీ షోస్ నుండి అయితే గంటకు 5 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అంతకు మించి మాత్రం ట్రెండ్ ముందుకు కదలలేదు. దీనిని బట్టీ చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు గ్రాస్ వసూళ్లు పది కోట్ల రూపాయలకు మించేలా కనిపించడం లేదు. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే ఈ చిత్రం దాదాపుగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. కానీ ఆ రేంజ్ కి ఈ సినిమా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అయితే చేరేలా లేదు. చూడాలి మరి ఫుల్ రన్ లో స్లో పాయిజన్ లాగా ఆడియన్స్ కి ఎక్కుతుందో లేదో అనేది. ఈ చిత్రానికి రానా నిర్మాతగా వ్యవహరించడమే కాదు, ఒక కీలక పాత్ర కూడా పోషించాడు. ప్రముఖ తమిళ నటుడు సముద్ర ఖని కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం లో భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్ గా నటించింది.