Nag Ashwin: చిన్న సినిమాలతో కెరీర్ ని ప్రారంభించి వెయ్యి కోట్ల సినిమా ని తీసే రేంజ్ కి ఎదిగిన దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin). ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఆయన, మహానటి తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయ్ దేవరకొండ లాంటి యంగ్ సెన్సేషన్ ని టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం చేసింది ఈయనే. ఇక మహానటి తర్వాత ఏకంగా ప్రభాస్ తో ‘కల్కి’ చిత్రాన్ని తెరకెక్కించే రేంజ్ కి వెళ్ళిపోయాడు. సాధారణంగా అంత పెద్ద సినిమాలను తెరకెక్కించాలంటే కచ్చితంగా అనుభవం ఉండాలి. కానీ అంత గొప్ప అనుభవం లేకపోయినప్పటికీ కూడా, తన విజన్ లో ఉన్న ఆలోచనలను వెండితెర పై అద్భుతంగా చూపించడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు నాగ్ అశ్విన్. రాజమౌళి కి మాత్రమే గ్రాండియర్ చిత్రాలు సాధ్యం అని అనుకుంటున్నా సమయంలో నాగ్ అశ్విన్ నేను కూడా అలాంటి సినిమాలను తియ్యగలను అని నిరూపించి చూపించాడు.
అయితే నాగ్ అశ్విన్ తదుపరి చిత్రం ఏమిటి?, కల్కి 2 నే చేస్తాడా? లేదా మధ్యలో ఏమైనా సినిమా తీస్తాడా అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ అశ్విన్ ఈసారి దర్శకుడిగా కాదు, నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తాడట. ఆదిత్య 369 లాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను ఎన్నో టాలీవుడ్ కి అందించిన సింగీతం శ్రీనివాస్ రావు తో సినిమా అంటే రిస్క్ అని ఎందుకు అనుకుంటున్నారు అని మీరు అనుకోవచ్చు. సింగీతం ఆలోచనలు ఇప్పటి ఆడియన్స్ కి తగ్గట్టుగా ఉంటాయో లేదో కూడా చూడాలి కదా. కేవలం నాగ్ అశ్విన్ తప్ప ఆయనతో సినిమాని నిర్మించే నిర్మాతలు టాలీవుడ్ లో ఎవ్వరూ లేరు అనేది వాస్తవం.అంతే కాదు, ఈ సినిమాలో టాప్ నటీనటులు కూడా ఉండరట. మొత్తం కొత్తవాళ్ళతోనే నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట నాగ్ అశ్విన్. ఇది చాలా పెద్ద ప్రయోగం అనే చెప్పాలి. బడ్జెట్ మీడియం రేంజ్ లో ఉంటే పర్వాలేదు. ఒకవేళ భారీ బడ్జెట్ పెట్టి తీస్తే మాత్రం పెద్ద రిస్క్ చేస్తున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.