Andhra King Taluka : రీసెంట్ గానే హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Thaluka) అనే చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కోసం క్రియేట్ చేసుకున్న ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అనే టైటిల్ ని ఆధారంగా తీసుకొని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ని పెట్టినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ టైటిల్ ని విన్నప్పుడు ఇందులో హీరో పవన్ కళ్యాణ్ లేదా ఎన్టీఆర్ లేదా మహేష్ బాబు అభిమాని అయ్యి ఉంటాడని అంతా అనుకున్నారు. వీళ్ళు కాకపోయినా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి హీరోలలో ఎవరో ఒకరు అయ్యి ఉంటారని ప్రేక్షకులు అంచనా వేశారు. అలా అంచనా వేసిన ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తూ కన్నడ హీరో ఉపేంద్ర(Upendra) ని ఆంధ్రా కింగ్ అంటూ చెప్పుకొచ్చారు.
దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపేంద్ర అంటే మాకు కూడా ఇష్టమే, కానీ మీరు పెట్టిన టైటిల్ కి ఆయనకు ఏమైనా సంబంధం ఉన్నదా? అంటూ కామెంట్స్ చేశారు. తెలుగు లో మీకు నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలను తీసుకొని ఈ సినిమాని చెయ్యాలనే ఆలోచనే రాలేదా?, ఇది ముమ్మాటికీ మన తెలుగు హీరోలను అవమానించడమే అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదని అంటున్నారు విశ్లేషకులు. విచిత్రం ఏమిటంటే ఈ క్యారక్టర్ ని ముందుగా ఉపేంద్ర తో చేయించాలని అనుకోలేదట. మలయాళం సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న మమ్మూటీ, మోహన్ లాల్ వంటి వారిని సంప్రదించారట. డైరెక్టర్ మహేష్ బాబు ఆలోచన ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. మన తెలుగు లో హీరోలు కరువు అయ్యారా..? కనీసం రెండో ఛాయస్ గా కూడా మన తెలుగు హీరోలను సంప్రదించలేదు అనేదే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.
Alos Read : రామ్ తో నిశ్చితార్థం పై స్పందించిన భాగ్యశ్రీ భోర్సే..లేటెస్ట్ పోస్ట్ వైరల్!
వెంకటేష్, నాగార్జున వంటి వారిని అడిగితే ఈ క్యారక్టర్ చేయకుండా ఉండరు. చిరంజీవి ని అడిగినా చేస్తాడు. గతంలో వెంకటేష్, రామ్ కాంబినేషన్ లో మసాలా అనే చిత్రం కూడా వచ్చింది. వాళ్ళ మధ్య మంచి ర్యాపో కూడా ఉంది. అయినప్పటికీ వెంకటేష్ ని తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్ కి రాలేదు. అయితే తెలుగు హీరోలను తీసుకోకపోవడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా..?, కథ కు రిలేషన్ ఉంటుందా? అసలు దీనికి సమాధానం ఏమిటి అనేది తెలియాలంటే డైరెక్టర్ నోరు విప్పే వరకు ఎదురు చూడాల్సిందే. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. వరుస ఫ్లాప్స్ తర్వాత రామ్ చేస్తున్న చిత్రమిది. మంచి ఎమోషనల్ టచ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఈ ఏడాది లోనే విడుదల కాబోతుంది.