Andhra King Taluka: రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ వచ్చిన ఈ సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడని, ఇంతటి ఫీల్ గుడ్ సినిమా ఈమధ్య కాలం లో రామ్ కెరీర్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లోనే రాలేదని, ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. కానీ రామ్ గత చిత్రాల ప్రభావం కారణం గానో, లేకపోతే ఇలాంటి జానర్స్ జనాలు చూసేందుకు ఇష్టపడరో తెలీదు కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత రేంజ్ లో రన్ అవ్వడం లేదు. ఓపెనింగ్స్ ఎలాగో ఆశించిన స్థాయిలో రాలేదు, కనీసం లాంగ్ రన్ లో అయినా మంచి రన్ ఉంటుందని అనుకుంటే అది కూడా జరగడం లేదు.
Also Read:‘అఖండ 2’ సెన్సార్ టాక్ వచ్చేసింది..సెకండ్ హాఫ్ కి ఇలాంటి రిపోర్ట్ ఊహించలేదుగా!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా చేరుతుందని అనుకుంటే, దరిదాపుల్లోకి కూడా వెళ్ళకపోవడం గమనార్హం. ఆంధ్ర ప్రదేశ్ సంగతి పక్కన పెడితే, ఓవర్సీస్ లో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు కచ్చితంగా ఆదరిస్తారు, అక్కడ బాగా ఆడుతుంది, కెరీర్ లో మొట్టమొదటిసారి రామ్ నార్త్ అమెరికా లో 1 మిలియన్ గ్రాస్ ని అందుకోబోతున్నాడని ఆయన అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆ ఆశ అత్యాశ గానే మిగిలిపోయింది. అక్కడ కూడా ఈ చిత్రానికి అనుకున్నంత రేంజ్ వసూళ్లు రావడం లేదు. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే కచ్చితంగా ఈ చిత్రం 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి.
వీకెండ్ నే ఇంత వీక్ కలెక్షన్స్ ఉంటే, ఇక వర్కింగ్ డేస్ లో ఈ చిత్రాన్ని ఎవరు చూస్తారు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చేలా అనిపిస్తోంది. పాపం రామ్ బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. నవంబర్ నెలలో విడుదల చేయడమే నిర్మాతలు చేసిన తప్పా? అంటే కచ్చితంగా అవును అనే చెప్పొచ్చు. నవంబర్ నెల సినిమాలకు మంచిది కాదు. ఈ నెలలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. భారీ అంచనాలు ఉండడం వల్ల, అప్పట్లో నాగార్జున డమరుకం చిత్రం కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటికేయీ ఆ సినిమానే నవంబర్ నెలలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఈ నెల లో విడుదలయ్యే సినిమాలకు ఆడియన్స్ లో ఎంత డిమాండ్ ఉంది అనేది.