Andhra King Taluka Closing Collections: మన టాలీవుడ్ లో పాజిటివ్ టాక్ తో మొదలైన కొన్ని సినిమాలు ఎందుకో కొన్ని అనుకోని కారణాల వల్ల డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రీసెంట్ గా విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Movie) చిత్రం. రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన ఈ సినిమాపై విడుదలకు ముందు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండేవి. ఎందుకంటే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. థియేట్రికల్ ట్రైలర్, టీజర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో కచ్చితంగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవుతుందని అనుకున్నారు. అలాంటి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న హీరో రామ్ ఎట్టకేలకు కోలుకున్నాడు అని అంతా అనుకున్నారు.
కానీ సోషల్ మీడియా లో ఉన్నంత పాజిటివ్ టాక్ బయట లేదేమో తెలియదు కానీ, ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్ర దర్శకుడు మహేష్ బాబు గత చిత్రం ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, అదే విధంగా ఈ సినిమాలోని పాటలు కూడా పెద్ద హిట్ అవ్వడంతో మేకర్స్ ఈ చిత్రాన్ని బయ్యర్స్ కి 28 కోట్ల రూపాయలకు అమ్మేశారు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ కి ఇది చాలా పెద్ద బిజినెస్ అనే చెప్పాలి. అయితే ఈ బిజినెస్ ని చేరుకోవడం లో విడుదల తర్వాత సినిమా దారుణంగా విఫలం అయ్యింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 5 కోట్ల 78 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, సీడెడ్ నుండి కోటి 5 లక్షల రూపాయిలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 5 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 12 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే ఓవర్సీస్ నుండి రెండు కోట్ల 41 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాలు, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 11 కోట్ల 59 లక్షల రూపాయిల నష్టాలు వాటిల్లాయి.