Andhra King Taluka 4 days Collections: రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Talukaa) రీసెంట్ గానే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఈమధ్య కాలం లో ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ రాలేదని, వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న రామ్ కి ఈ చిత్రం ద్వారా మంచి రిలీఫ్ దొరికిందని అంతా అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏమిటంటే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం ఇప్పుడు దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. విడుదలకు ముందు ఈ చిత్రం లోని పాటలు పెద్ద హిట్ అవ్వడం, దానికి తోడు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం, టీం మొత్తం ప్రొమోషన్స్ తో అదరగొట్టేయడం తో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకు జరిగింది. కచ్చితంగా సూపర్ హిట్ ఆవుతుంది అనే నమ్మకం రావడం తోనే బయ్యర్స్ రిస్క్ చేశారు .
కానీ మొదటి వీకెండ్ ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు చూస్తే బయ్యర్స్ ఏడవకుండా ఉండలేరు. నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 12 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 4 కోట్ల 60 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 62 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి రెండు కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 21 కోట్ల 45 లక్షల గ్రాస్ వసూళ్లు, 12 కోట్ల 9 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 16 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాలి. చూడాలి మరి వర్కింగ్ డేస్ లో ఎంత వసూళ్లను రాబట్టబోతుంది అనేది.