Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన వరుస సినిమాలను చేయడం పట్ల కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ చిరంజీవికి సినిమా తప్ప వేరే ప్రపంచం అయితే లేదు అంటూ ఆయన మీద ప్రశంసలను కురిపిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి ఈ సమ్మర్ లో రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత 2026 సమ్మర్ లో శ్రీకాంత్ ఓదెల సినిమాని స్టార్ట్ చేసే ఉద్దేశ్యంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను చేసి శ్రీకాంత్ ఓదెలకి భారీ సక్సెస్ ని కట్టబెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చిరంజీవి మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను చిరంజీవి ఇంతవరకు తన కెరియర్ లో చేయనటువంటి ఒక కొత్త జానర్ లో తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చిరంజీవి ఎప్పుడైతే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడో అప్పటినుంచి యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు.
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు అతని అభిమానులే కావడం వల్ల వాళ్లతో సినిమాలు చేస్తే వాళ్లు తనని ఎలాగైతే ఊహించుకున్నారో అలా ప్రతి ఒక్క క్యారెక్టర్ లో చూపించడానికి ఆసక్తి చూపిస్తారు.
కాబట్టి చిరంజీవి తన ఫ్యాన్స్ నే సినిమా డైరెక్టర్లుగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న చిరంజీవి ఈ ఏజ్ లో కూడా తీవ్రంగా కష్టపడడం అనేది ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ను గాని లేదంటే త్రిషను గాని తీసుకునే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి వీళ్ళిద్దరితో ఇంతకుముందు చిరంజీవి కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. మరి మరోసారి వీళ్ళ కాంబినేషన్ ని రిపీట్ చేయడానికి శ్రీకాంత్ ఓదెల అసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేయడానికి ఆయన అసక్తి చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి…