https://oktelugu.com/

chat : అక్కడికి వెళ్లి చాట్ అమ్మితే లక్షలు సంపాదించవచ్చు..

డబ్బులు సంపాదించాలనే కృషి పట్టుదల ఉంటే ఈ విషయం పెద్ద కష్టం కాదు. సంపాదన ముఖ్యం. దానికి పట్టుదల మరింత ముఖ్యం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 13, 2024 / 01:55 PM IST

    chat

    Follow us on

    chat : డబ్బులు సంపాదించాలనే కృషి పట్టుదల ఉంటే ఈ విషయం పెద్ద కష్టం కాదు. సంపాదన ముఖ్యం. దానికి పట్టుదల మరింత ముఖ్యం. పట్టువిడవని విక్రమార్కుడిలా సాధిస్తుంటే ఎంతటి కష్టం అయినా మీ ముందు తలవంచుతుంది. కానీ ఆ కష్టం, సంకల్పం మీలో ఉండాలి. కొందరు ఎంత కష్టపడినా సరే ఒక రోజుకు రూ. 500 నుంచి రూ. 1000 వరకు మాత్రమే సంపాదిస్తారు. జాబ్ చేసే వాళ్లయినా, చిరు వ్యాపారాలు అయినా సరే ఎవరైనా దాదాపుగా ఇంతే సంపాదిస్తారు. ఇక జాబ్స్ లో పెద్ద పొజిషన్ లో ఉన్న వారైతే నెలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు వరకు సంపాదిస్తుంటారు. ఇంతకు పైగా కూడా కొందరికి సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇక పెద్ద పొజీషన్ లో ఉంటే మాత్రం ఇది సాధ్యం. లేదంటే కష్టం. అయితే చాట్ అమ్ముతూ కూడా లక్షలు సంపాదించవచ్చు తెలుసా?

    అవును మన దేశ రాజధాని ఢిల్లీలో కేవలం చాట్ అమ్ముతూ రోజుకు రూ.10 వేలు సంపాదించవచ్చు. ఏకంగా రూ. 10 వేల నుంచి రూ.లక్షకు పైగా సంపాదించే వారు కూడా ఢిల్లీలో ఉన్నారు. వారంతా పెద్ద పెద్ద హోటల్స్ నిర్వహిస్తున్నారు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. లేదంటే వీరు కస్టమర్లను ఆకర్షించడానికి ఏదో మాయం చేస్తున్నారు అని కూడా అనుకోవద్దు.

    చిన్న చిన్న బడ్డీలు, బండ్లు పెట్టుకొని డిల్లీలో చాట్ అమ్ముతుంటారు జనాలు. ఢిల్లీలో చాట్ అమ్మే వారు దగ్గర దగ్గర 70 వేల కు పైగా ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. ఈ లిస్టులోని వ్యాపారుల్లో సియా రామ్ ఒకరు. ఆయన ఢిల్లీలో ఘుగ్ని, ఛోలే కుల్చా(చాట్ బఠాని, జొన్నరొట్టెలు) అమ్ముతున్నారు. ఇలా రోజుకు రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారట. ఆయన ఈ వ్యాపారాన్ని 60 సంవత్సరాలుగా చేస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీ లో చాలా ఫేమస్. ఢిల్లీలో ఉండేవారు, అక్కడికి పనులకు వచ్చిన వారు సియా రామ్ దగ్గరకు వచ్చి కచ్చితంగా ఘుగ్ని తినేసి వెళ్తారు. ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారు సియా.

    ఈయన విజయ రహస్యం తెలుసుకుంటే జాబ్ చేస్తున్నవారు కూడా వెళ్లి ఢిల్లీలో బిజినెస్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వీధి వ్యాపారులు ఢిల్లీలో వీధికి ఒకరు ఉంటారు. . కానీ ఎవరి వ్యాపారం వారిదే. లోకల్ గా ఉండే వారు మాత్రం ఇప్పటికే వారికి రెగ్యులర్ కస్టమర్లుగా అయ్యారు.చాట్ తయారీలో నాణ్యత, రుచిని మెయింటెయిన్ చేస్తాడు ఈ సియా రామ్. అందుకే కస్టమర్లు ఆయన దగ్గరకు వెళ్లి మరీ చాట్ తిని వస్తారు. సెంట్రల్ మార్కెట్‌లో బట్టల దుకాణాల పక్కన రోడ్డు మీద ఈయన దుకాణం ఉంది. అయితే ప్రతిరోజూ ఆలీగఢ్ నుంచి ఢిల్లీకి వచ్చి ఈ వ్యాపారం చేస్తుంటాడు సియా. కొందరు మాత్రమే రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఢిల్లీలో వీధి వ్యాపారులు కేవలం చాట్ అమ్మి రూ.లక్షల్లో సంపాదించడం ఆశ్చర్యం కదా.