Homeఎంటర్టైన్మెంట్Anchors Turns Heroines: యాంకర్స్ నుంచి హీరోయిన్లుగా మారింది వీళ్లే !

Anchors Turns Heroines: యాంకర్స్ నుంచి హీరోయిన్లుగా మారింది వీళ్లే !

Anchors Turns Heroines: యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్స్ గా, నటీమణులుగా మారిన గ్లామర్ బ్యూటీలు చాలామందే ఉన్నారు. యాంకర్‌ సుమ కనకాల నుంచి విష్టు ప్రియ వరకు చాలామంది యాంకర్లు సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్లే. పైగా వీరిలో హీరోయిన్లుగా కూడా తమ టాలెంట్‌ ను
నిరూపించుకున్నారు. ఈ కోవలో చాలామంది యాంకర్లు వెండి తెరపై తమ సత్తా చాటుతున్నారు. ఇంతకీ ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుందాం.

సుమ కనకాల:

Anchors Turns Heroines
Suma Kanakala

నిజానికి నటిగానే సుమ తన కెరీర్‌ ను స్టార్ట్‌ చేసింది. కొన్ని సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రల్లో కనిపించారు. ఐతే, ఆ తర్వాత తన దృష్టి మొత్తం యాంకరింగ్‌ మీదే పెట్టింది. గత కొన్నేళ్లుగా యాంకర్ గా తెలుగు యాంకరింగ్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్న సుమ.. ప్రస్తుతం తన 46 ఏళ్ళ వయస్సులో జయమ్మ పంచాయతీ అనే సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తోంది.

Also Read: Senior NTR assets : సీనియర్ ఎన్టీఆర్ ఆస్తులెన్ని? అవి ఏమైపోయాయో తెలుసా?

రష్మీ గౌతమ్‌:

Anchors Turns Heroines
Rashmi Gautam

బోల్డ్ యాంకర్ రష్మీ గౌతమ్ కు ప్రస్తుతం టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ, సినిమాల్లో మాత్రం ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోవడం లేదు. చివరకు అనసూయకి వస్తోన్న ఐటమ్ సాంగ్స్ కూడా రష్మీకి రావాడం లేదు. అయినా ఈమెకు వెండి తెర మీద చాలా క్రేజ్ ఉంది. కొన్ని చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ తన సత్తా చాటుతూనే ఉంది. ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్‌ లో ఒక ఐటమ్ సాంగ్‌ చేస్తోంది రష్మీ.

అనసూయ భరద్వాజ్‌:

Anchors Turns Heroines
Anasuya Bharadwaj

‘జబర్థస్త్’ యాంకర్‌ గా తన అందచందాలతో ప్రేక్షకులను అలరించి ఫుల్ క్రేజ్ ను సంపాదించింది ఆల్ టైం బ్యూటీ ‘అనసూయ’. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. వెండితెర పై ఫుల్ డిమాండ్ తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది.

శీముఖి:

Anchors Turns Heroines
Sreemukhi

ప్రస్తుతం బుల్లి తెర పై క్రేజ్ ఉన్న యాంకర్లలో శ్రీముఖి పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘శ్రీముఖి’ బుల్లితెర పై చిన్న రాములమ్మ అంటూ విజయశాంతినే ఆమెకు కితాబు ఇచ్చింది, అయితే, శ్రీముఖి మాత్రం తన కెరీర్ ను తన స్థాయికి తగ్గట్టు ప్లాన్ చేసుకోలేదు. బంగారం కురిసే సినీ తెరను వదిలేసి, చిల్లర రాలుతున్న బుల్లితెరకే ఇన్నాళ్లు పరిమితం అయిపోయింది. కాకపోతే కొన్ని సినిమా అవకాశాలతో వెండితెర పై హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో మెరిసింది.

కలర్స్‌ స్వాతి :

Swathi Reddy
Swathi Reddy

కలర్స్‌ అనే ప్రోగ్రాంతో యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న కలర్స్ స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్ గా వరుస అవకాశాలతో చాలా సినిమాలు చేసింది. కొన్నాళ్ళు పాటు బిజీ హీరోయిన్ గా తన హవాను కొనసాగించింది.

రెజీనా కెసెండ్రా :

Regina Cassandra
Regina Cassandra

మీకు తెలుసా ? యాంకర్ గానే రెజీనా తన కెరీర్‌ ను స్టార్ట్ చేసింది. చాలా మందికి తెలియదు. తమిళనాడులో ఓ ప్రముఖ ఛానల్‌ లో ఒకప్పుడు ఆమె మంచి యాంకర్‌. ఆమెలో హీరోయిన్ మెటీరియల్ ఉందని గమనించిన తమిళ మేకర్స్.. ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు.

నిహారిక కొణిదెల:

Niharika Konidela
Niharika Konidela

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అందుకే.. ఆమె మొదట తన కెరీర్ ను యాంకర్ గానే స్టార్ట్ చేసింది. ఢీ అనో ప్రోగ్రాంతో పాటు మరికొన్ని ప్రోగ్రామ్స్‌ లో నిహారిక యాంకర్ గా మెరిశారు. ఆ తర్వాత హీరోయిన్‌ గా కూడా కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాతగా కొత్త అవతారం ఎత్తారు.

విష్ణు ప్రియ:

Vishnupriya
Vishnupriya

బుల్లితెర పై ఇప్పుడున్న కొత్త యాంకర్లలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ యాంకర్‌ విష్ణు ప్రియా. యాంకర్ గా పెద్దగా ఇమేజ్ తెచ్చుకోక ముందే.. కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో హీరోయిన్‌ గా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది విష్ణు ప్రియ.

ఉదయభాను:

Udaya Bhanu
Udaya Bhanu

సీనియర్‌ యాంకర్‌ ఉదయభాను గురించి ఇప్పుడు కొత్తగా ఏమి చెప్పాలి. ఇప్పుడున్న యాంకర్స్ అందరిలో కల్లా ఆమె సీనియర్ యాంకర్. ఇక ఉదయభాను హీరోయిన్‌ గా కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఉదయభాను ప్రస్తుతం తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ను మొదలుపెట్టింది. ఇవ్వండీ హీరోయిన్లు గా మారిన యాంకర్ల సంగతులు.

Also Read: SS Rajamouli Personal Life: రాజ‌మౌళిది పెద్ద జ‌మిందారి కుటుంబం.. అప్ప‌ట్లోనే వారి ఆస్తులు ఎన్నో తెలుసా..?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

2 COMMENTS

  1. […] Tiger Nageswara Rao Movie New Update: ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన వ్యక్తి ‘టైగర్ నాగేశ్వరరావు’. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ముహూర్తం, ప్రీలుక్ ఏప్రిల్ 2న మధ్యాహ్నం 12.06 గంటలకు ఫిక్స్ చేశారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular