Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా, త‌ల్లిగా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Megastar Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న హీరోయిన్ గా, త‌ల్లిగా న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Megastar Chiranjeevi: సినిమా రంగంలో రాణించాలంటే సక్సెస్ రేటు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హీరోయిన్లకు సక్సెస్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి. హీరోలకు సక్సెస్ రేటు తక్కువగా ఉన్నాసరే వారికి ప్రత్యేక అభిమానులు ఉంటారు కాబట్టి.. ఆటోమేటిక్ గా ఒకే టైంలో మూడు నాలుగు సినిమాలు చేస్తుంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్లు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్లుగా చేసి.. ఆ తర్వాత అవకాశాలు రాక సెకండ్ ఇన్నింగ్స్ లో అదే హీరోకు తల్లిగా కూడా నటించే వారు. ఇలా చిరంజీవి పక్కన హీరోయిన్లుగా ఆ తర్వాత తల్లిగా నటించిన ఇద్దరు హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Megastar Chiranjeevi
megastar chiranjeevi, jayasurya

ఈ ఇద్దరూ ఎవరో కాదండోయ్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు జయసుధ, సుజాత. 1979లో కె.బాలచందర్ డైరెక్షన్ లో చిరంజీవి ఇది కథ కాదు అనే సినిమా చేశారు. ఇందులో హీరోయిన్ గా జయసుధ నటించింది. ఆ తర్వాత 1986లో విజయబాపినీడు డైరెక్షన్ లో రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా చిరంజీవి మగధీరుడు అనే సినిమాను చేశారు. ఇందులో కూడా జయసుధ హీరోయిన్ గా న‌టించింది. విచిత్రమేంటంటే ఈ సినిమా వచ్చిన తొమ్మిదేళ్లకి 1995లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేసిన రిక్షావోడు సినిమాలో ఆయనకు తల్లిగా జయసుధ నటించింది.

Also Read: Anchors Turns Heroines: యాంకర్స్ నుంచి హీరోయిన్లుగా మారింది వీళ్లే !

మరో స్టార్ హీరోయిన్ సుజాత 1980లో చిట్టిబాబు డైరెక్షన్ లో చిరంజీవి చేసిన ప్రేమ తరంగాలు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 1982లో ఈరంకి శర్మ డైరెక్షన్ లో వచ్చిన సీతాదేవి మూవీలో కూడా ఆమెనే హీరోయిన్ గా చిరంజీవి పక్కన నటించి మెప్పించింది. అయితే 1995లో విజయబాపినీడు డైరెక్షన్ లో చిరంజీవి చేసిన బిగ్ బాస్ మూవీలో ఆయనకు తల్లిగా సుజాత నటించింది.

Megastar Chiranjeevi
megastar chiranjeevi, sujatha

విచిత్రమేంటంటే ఈ ఇద్దరు హీరోయిన్లు చిరంజీవి తల్లిగా నటించిన సినిమాలకు విజయ బాపినీడు డైరెక్టర్. దాంతోపాటు ఈ రెండు సినిమాలు కూడా 1995 లోనే రిలీజ్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే 1980లో ప్రేమ తరంగాలు సినిమాలో జయసుధ, సుజాత కలిసి నటించారు. ఇప్పటికి కూడా జయసుధ తల్లి పాత్రలో, నానమ్మ పాత్రలో నటిస్తూనే ఉంది. కానీ సుజాత కొంతకాలం తల్లి పాత్రల్లో నటించి.. ఆ తర్వాత మాత్రం నటనకు దూరమైంది.

Also Read: SS Rajamouli Personal Life: రాజ‌మౌళిది పెద్ద జ‌మిందారి కుటుంబం.. అప్ప‌ట్లోనే వారి ఆస్తులు ఎన్నో తెలుసా..?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Yash KGF2 Censor Report: షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిస్తున్న `కేజీఎఫ్’ సిరీస్ పై రోజురోజుకు క్రేజ్ రెట్టింపు అవుతూ ఉంది. ముఖ్యంగా `కేజీఎఫ్ 2′ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది. ఇప్పటికే `కేజీఎఫ్ 2′ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సినీ లోకాన్ని ఒక ఊపు ఊపేసింది. […]

  2. […] RRR 6th Day Collections: ‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను నెలకొల్పి.. ఏ స్థాయి చరిత్రను సృష్టిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోపక్క ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు షేక్ అయిపోతున్న బాక్సాఫీస్ ను చూసి ట్రేడ్‌ పండితుల సైతం కలెక్షన్ల ప్రవాహాన్ని అంచనా వేయలేక నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular