Vishnu Priya Birthday: బర్త్ డే పార్టీలో హాట్నెస్ కి తెరలేపిన విష్ణుప్రియ… ఈ క్రేజీ యాంకర్ కి ఇంత అందమైన చెల్లి ఉందా!

విష్ణుప్రియ భీమినేని చెల్లి బర్త్ డే పార్టీలో రచ్చ చేసింది. హాట్ యాంకర్ విష్ణుప్రియ ఆమె సిస్టర్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. విష్ణుప్రియకు ఇంత అందమైన చెల్లి ఉందా... అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Written By: Gopi, Updated On : August 26, 2024 11:38 am

Vishnu Priya Birthday

Follow us on

Vishnu Priya Birthday: విష్ణుప్రియ టాలీవుడ్ హాట్ యాంకర్స్ లో ఒకరు. యూట్యూబర్ గా ఆమె కెరీర్ మొదలైంది. గతంలో విష్ణుప్రియ కామెడీ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అనంతరం యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుధీర్-విష్ణుప్రియ యాంకర్స్ గా పోవే పోరా పేరుతో ఓ యూత్ఫుల్ షో ప్రసారమైంది. ఈ షో వేదికగా విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. కొన్నాళ్ళు విష్ణుప్రియ యాంకర్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమె యాంకరింగ్ చేయడం లేదు.

నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. విష్ణుప్రియ నటించిన వెబ్ సిరీస్ దయ గత ఏడాది విడుదలైంది. హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన దయ సిరీస్లో విష్ణుప్రియ కీలక రోల్ దక్కించుకోవడం విశేషం. జే డీ చక్రవర్తి ప్రధాన పాత్ర చేసిన ఈ సిరీస్లో ఈషా రెబ్బా మరో కీలక రోల్ చేసింది. విష్ణుప్రియ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది. దయ సిరీస్లో విష్ణుప్రియ లేడీ జర్నలిస్ట్ రోల్ చేసింది.

దయ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 అందుబాటులోకి రానుందని సమాచారం. అలాగే వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఓ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ మూవీలో నటించారు. వాంటెడ్ పండుగాడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే సిల్వర్ స్క్రీన్ పై కనిపించే అవకాశం ఇచ్చినందుకు ఆ చిత్ర యూనిట్ కి విష్ణుప్రియ కృతజ్ఞతలు తెలిపింది.

మరోవైపు విష్ణుప్రియ సోషల్ మీడియా గ్లామర్ డాల్ గా అవతరించింది. మోతాదుకు మించి విష్ణుప్రియ స్కిన్ షో చేస్తుంది. విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఆమె ఒక పోస్ట్ పెడితే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. విష్ణుప్రియ తల్లి కూడా ఇండస్ట్రీలో పని చేసిందట. ఆమె శ్రియ శరణ్, ఆర్తి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్స్ వద్ద హెయిర్ డ్రెస్సర్ గా పని చేసిందట.

విష్ణుప్రియ తల్లి ఇటీవల మరణించింది. కాగా విష్ణుప్రియకు ఓ సిస్టర్ ఉంది. అప్పుడప్పుడు సిస్టర్ తో కలిసి వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంది విష్ణుప్రియ. అయితే విష్ణుప్రియ చెల్లి గురించి జనాలకు తెలిసింది తక్కువే. విష్ణుప్రియ సిస్టర్ పేరు పావని. ఆమె బర్త్ డే కాగా ఇద్దరూ విదేశాలకు చెక్కేశారు. సముద్రతీరంలో ఇద్దరూ చిల్ అవుతున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ఇక విష్ణుప్రియ చెల్లి పావనిని చూసిన నెటిజెన్స్ చాలా అందంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.