Homeఎంటర్టైన్మెంట్Anchor Suma: ఫైనల్ గా గుడ్ బై చెప్పనున్న యాంకర్ సుమ?

Anchor Suma: ఫైనల్ గా గుడ్ బై చెప్పనున్న యాంకర్ సుమ?

Anchor Suma: తెలుగు బుల్లితెరపై సుమ చెరగని ముద్ర వేశారు. యాంకర్ గా ఎవరూ బీట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఆమె ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారు. 48 ఏళ్ల సుమకు ఇప్పటికి కూడా పోటీ ఇచ్చే యాంకర్ పరిశ్రమలో లేరు. భాషలపై పట్టు, చురుకుతనం, సమయస్ఫూర్తి ఆమెను స్టార్ యాంకర్ ని చేశాయి. ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ, సంపాదన ఆమె సొంతం. అయితే సుమ నటిగా ఫెయిల్. యాంకర్ సుమ కెరీర్ మొదలైంది హీరోయిన్ గానే.

Anchor Suma
Anchor Suma

1996లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. తన మాతృక మలయాళం లో హీరోయిన్ గా ఒకటి రెండు చిత్రాలు చేశారు. అక్కడ కూడా ఆమెకు బ్రేక్ రాలేదు. అనంతరం ఆమె యాంకర్ గా మారడం జరిగింది. ఈ ఫీల్డ్ లో ఆమె తిరుగులేని చరిత్ర లిఖించారు. స్టార్ యాంకర్ గా ఉన్నప్పుడు చిన్న చిన్న క్యామియో రోల్స్ చేశారు.

Also Read: Tees Maar Khan Teaser: పాయల్ నుండి మరో RX 100… హీరో ఆది పంట పండిందే!

ఎందుకో చాలా కాలం తర్వాత ఆమె మరలా హీరోయిన్ కావాలని ఆశపడ్డారు. జయమ్మ పంచాయితీ చిత్రం చేశారు. ఈ ప్రయత్నం కూడా ఆమెకు నిరాశే మిగిల్చింది. జయమ్మ పంచాయితీ చిత్రాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. ఆమె ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని చూడలేదు. నటిగా ప్రయత్నించి తప్పు చేశానని సుమకు బాగా అర్థమైంది. తనను జనాలు యాంకర్ గానే ఆదరిస్తారు, హీరోయిన్ గా , నటిగా కాదని ఆమెకు బోధపడింది. ఈ క్రమంలో ఇకపై నటన జోలికి పోకూడదని సుమ డిసైడ్ అయ్యారట. హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, పూర్తి స్థాయి పాత్రలకు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నారట.

Anchor Suma
Anchor Suma

ఎప్పటిలాగే యాంకర్ గా కొనసాగుతూ గెస్ట్ రోల్స్ మాత్రమే చేయాలని గట్టిగా అనుకున్నారట. కాబట్టి సుమ నుండి ఇకపై జయమ్మ పంచాయితీ లాంటి చిత్రాలు రావడం కష్టమే అంటున్నారు. మరోవైపు సుమ తన కొడుకుని హీరోగా లాంచ్ చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు . ఏదైనా అనుభవం అయితే కానీ తెలియదు. జయమ్మ పంచాయితీ ఇచ్చిన షాక్ అలాంటిది మరి.

Also Read: Sudigali Sudheer Comments On Rashmi: యాంకర్ రష్మీ గురించి సంచలన విషయం చెప్పి ఎమోషనల్ అయిన సుడిగాలి సుధీర్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version