https://oktelugu.com/

Anchor Srimukhi : నాలుగేళ్లుగా రహస్య ప్రేమాయణం… యంగ్ హీరోతో యాంకర్ శ్రీముఖి పెళ్లి!

ఇక శ్రీముఖి ఒక పక్క షోలు మరో పక్క సినిమాలు చేస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. స్టార్ మా లో పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, నీతోనే డాన్స్ 2.0 వంటి షో లకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Written By:
  • S Reddy
  • , Updated On : April 1, 2024 / 08:13 PM IST

    Anchor Srimukhi

    Follow us on

    Anchor Srimukhi : యాంకర్ శ్రీముఖి పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరపై సందడి చేస్తూ టాప్ యాంకర్ గా రాణిస్తుంది. పటాస్ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. అనతి కాలంలోనే ఫేమ్ రాబట్టి స్టార్ యాంకర్ గా మారింది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి సత్తా చాటింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇస్తూ టైటిల్ బరిలో నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది.

    తాజాగా శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఓ యంగ్ హీరోతో శ్రీముఖి నాలుగేళ్లుగా లవ్ లో ఉందని .. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతుందని న్యూస్ చక్కర్లు కొడుతుంది. గతంలో కూడా ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లాడబోతుందని టాక్ నడిచింది. కానీ అదంతా నిజం కాదని .. అలాంటిది ఏదైనా ఉంటే స్వయంగా తానే చెప్తానని ఓ సందర్భంలో శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది.

    మరలా యంగ్ హీరోతో ఆమె ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. గత నాలుగేళ్లుగా టాలీవుడ్ హీరోతో శ్రీముఖి రిలేషన్ లో ఉందట. కుటుంబ సభ్యులకు సైతం ఈ విషయం తెలుసట. ఇక ఇద్దరి ఫ్యామిలీ మెంబర్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఏడాది చివర్లో ఆ హీరోని శ్రీముఖి పెళ్లాడనుందట. దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ .. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

    ఇక శ్రీముఖి ఒక పక్క షోలు మరో పక్క సినిమాలు చేస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. స్టార్ మా లో పలు షోలు, స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం, నీతోనే డాన్స్ 2.0 వంటి షో లకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఓటిటీ లో కూడా షోలు హోస్ట్ చేస్తుంది. భోళా శంకర్ సినిమాలో రొమాంటిక్ పాత్రలో కనిపించి మెగా ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. శ్రీముఖికి హీరోయిన్ గా ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటుందట.