బబ్లీ బ్యూటీ యాంకర్ శ్రీముఖికి పెళ్లి ఎప్పుడు ? ప్రతి చోట ఆమెను ఇదే ప్రశ్న అడుగుతున్నారట. తనకు రెగ్యులర్ గా ఎదురయ్యే ప్రశ్న కాబట్టి, శ్రీముఖి ఈ ప్రశ్న పట్ల బాగా విరక్తి చెందింది. అయితే, ప్రేమ పెళ్లి చేసుకోవడం అనేది ఎక్కుమంది యాంకర్స్ చేసిన పని. అలాగే ఇక ఎక్కువ అవకాశాలు రావట్లేదు, ఛాన్స్ లు పూర్తిగా తగ్గాయి అనుకున్న సమయంలో సైలెంట్ పెళ్లి చేసుకుంటారు.
కానీ, శ్రీముఖి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. పెళ్లి ఎప్పుడు అని ఎన్నిసార్లు అడిగినా.. కనీసం మూడేళ్లు ఆగాలంటోంది. అసలు మూడుముళ్లు వేయించుకోవడానికి మూడు ఏళ్ళు ఇంకా ఎందుకు ఆగాలో అంటూ నెటిజన్లు ఆమెనే అడుగుతున్నారు. అయితే, శ్రీముఖి మాత్రం పక్కా క్లారిటీతో ఉంది.
మొదటి నుండి.. అంటే, కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి 30 సంవత్సరాలు దాటిన తర్వాతే తానూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందట. ఇంకా 30లోకి అడుగు పెట్టడానికి ఇంకా రెండేళ్లు సమయం పడుతుందట. మొత్తానికి 30లోకి ఎంట్రీ ఇచ్చిన ఏడాది గ్యాప్ లో పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాను అంటూ శ్రీముఖి చెబుతుంది.
ఇక శ్రీముఖి ప్రేమ పై ఇప్పటికే అనేక పుకార్లు గత కొన్నేళ్లుగా షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఒక వ్యాపారవేత్తతో శ్రీముఖి డేటింగ్ చేస్తోంది అన్నారు. కానీ అందులో ఎంత వాస్తవం ఉందనేది తెలియదు. అంతకు ముందు తోటి యాంకర్ తో ప్రేమలో పడింది అన్నారు. అందులో కూడా ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.
ఇక మరోవైపు శ్రీముఖి హీరోయిన్ గా నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ వారం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా. ఏది ఏమైనా శ్రీముఖిలో హీరోయిన్ రేంజ్ గ్లామర్ ఉన్నా.. ఆమెను కేవలం యాంకర్ గానే చూస్తున్నారు.