Bigg Boss Non Stop Anchor Shiva
Bigg Boss Non Stop Anchor Shiva: గొడవలకు నాటకీయ కోణాలు జోడించడంలో ‘బిగ్ బాస్’ దిట్ట. హౌస్ లో బిగ్ బాస్ ఎప్పుడు ఎవరి మధ్య ఎలాంటి గొడవలు పెడతాడో, అలాగే ఎవర్ని ఎప్పుడు స్నేహితులుగా మారుస్తాడో ప్రేక్షకులే కాదు.. కంటెస్టెంట్లు కూడా ఊహించలేరు. పైగా, ప్రస్తుతం జరుగుతుంది బిగ్ బాస్ నాన్ స్టాప్. అందుకే ఈ హౌస్ లో ఎవరికి వారు హైలెట్ అవ్వాలని చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికీ వారు రెచ్చిపోతున్నారు.
Bigg Boss Non Stop Anchor Shiva
దీనికి తోడు ‘బిగ్ బాస్’ కూడా వాళ్ళను రెచ్చగొడుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా భారీ స్థాయిలో నమోదు అవుతాయేమో. అయితే, యాక్షన్ తో రెచ్చిపోయే వారు కొందరైతే.. కామెడీ చేస్తూ నవ్వులపాలు అయ్యేవాళ్లు మరికొందరు. కొత్తగా వచ్చిన ఛాలెంజర్స్ లలో కొందరు అనుకోకుండా అతికి పోయి చివరకు నలుగురి మధ్యలో నవ్వుల పాలవుతున్నారు.
Also Read: ముమైత్ ఖాన్ యాక్షన్.. శ్రీరాపాక రియాక్షన్
అదేంటో గానీ, హౌస్ లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి ‘యాంకర్ శివ’కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దానికితగ్గట్టు ఇతగాడు కూడా అతి చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నాడు. ప్రస్తుతం యాంకర్ శివ ఫోకస్ మొత్తం ‘హీరోయిన్ బిందు మాధవి’ మీదే ఉంది. అయితే, ‘భిందు మాదవి’ నుంచి అతనికి సరైన రియాక్షన్ రావడం లేదు. ఇదంతా గమనిస్తున్న అఖిల్ – అజయ్ అతని గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు.
Bindu Madhavi
యాంకర్ శివ తన పేరును బిందు మాధవి పేరును రాసుకొని కెమెరాకు చూపించాడు. అంటే అతను ఆ స్థాయిలో ఆమె పట్ల ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నాడు. కానీ, యాంకర్ శివను బిందు మాదవి సింపుల్ గా ‘బ్రో’ అనేసింది. ఈ విషయం గురించే అఖిల్ కు చెబుతూ అజయ్ పగలబడి నవ్వాడు.
అఖిల్ కూడా నేనేం తక్కువా అన్నట్టు యాంకర్ శివ పరిస్థితి పై నాలుగు కుళ్ళి జోకులు వేస్తూ మొత్తానికి అతగాడి గాలిని తీసేశాడు. పాపం ప్రేమను చూపిస్తూ ప్లే బాయ్ లా మారాలని ఆశ పడుతున్న శివకు, చివరకు అమ్మాయిల చేతిలో బఫూన్ అవుతున్నాడు.
Also Read: హౌస్‌లో హంగామా సృష్టిస్టున్న ముమైత్.. ఛాలెంజర్స్ టీమ్‌తో పెద్ద గొడవ