Anchor Ravi: రవి బుల్లితెర యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘సంథింగ్ సంథింగ్ ‘షో ద్వారా యాంకర్ గా తన పోటెన్షియాల్టీ ఏంటో చూపించాడు.తను ఆ తర్వాత ‘ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆడాళ్ళ మజాకా, పటాస్ లాంటి షోలతో తెలుగులో టాప్ యాంకర్ గా ఎదిగాడు…ఇక ఇలాంటి సమయంలో మేల్ యాంకర్స్ లో రవి నెంబర్ వన్ పొజిషన్ ని అందుకున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ కూడా చేశారు. ఇక ఆయన కెరియర్ అకస్మాత్తుగా పడిపోవడం తనకు షోలేమీ లేకుండా అయిపోవడం అనేది అతని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేస్తోంది… ఒకప్పుడు టాప్ యాంకర్ నుంచి పాతాళానికి పడిపోవడం పట్ల ఆయన స్పందిస్తూ ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశాడు… బుల్లితెర ఇండస్ట్రీ లో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని యాంకర్ గా నేను ఎదుగుతున్న సమయంలో చాలామంది నన్ను కిందికి లాగే ప్రయత్నం చేశారని, నా తోటి బ్యాచ్ వాళ్ళే నా మీద చేతబడి చేయించారని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు…
నిజానికి ఆ చేతబడు లను నేను నమ్మను కాబట్టి లైట్ తీసుకున్నా… మొత్తానికైతే నా మీద చేతబడులు ఎప్పుడైతే చేయించారో అప్పటి నుంచి నా కెరియర్ మొత్తం పడిపోయింది అంటూ ఆయన చెప్పడంతో చాలామంది రవి మీద సింపతిని చూపిస్తున్నారు… ఇప్పటివరకు ఆయన చేసిన షోలతో మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు. అలాగే ఆయన చేసిన ప్రతి షో కూడా చాలా మంచి టీఆర్పీ రేటింగ్ ను రాబట్టాయి…
కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏ షోలు చేయకుండా ఖాళీగా ఉండటం చూస్తున్న తన అభిమానులైతే తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూసిన మరి కొంతమంది నెటిజన్లు మాత్రం రవి మీద చేతబడి చేయించే అంత కోపం ఎవరికి ఉంది. వాళ్ళు ఎందుకని అలా చేయడం ఎవరి షో లు వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు మధ్యలో ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి.
ఒకరికి ఒకరు పోటీ కానప్పుడు ఇవన్నీ ఎందుకు అంటూ ఇంకొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండటం విశేషం… రవి ఇక మీదట మంచి షోలను ఎంచుకొని మరోసారి యాంకర్ గా బుల్లితెర మీద రాణిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…