https://oktelugu.com/

యాంకర్ రవి పర్సనల్ చాట్ ను పబ్లిక్ చేసిన వర్షిణి

బుల్లి తెర‌పై యాంక‌ర్ గా రాణిస్తున్న ర‌వి గురించి స్పెష‌ల్ గా ఇంట్రుడ్యూస్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన మాట తీరుతో.. పంచ్ ల‌తో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లేందుకు సీరియ‌స్ గా ట్రై చేస్తున్నాడు ర‌వి. కేవ‌లం టీవీ షోస్ లోనే కాకుండా.. సినిమా వేడుకల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే.. రవి జోష్ కనిపించేది మాత్రం స్మాల్ స్క్రీన్ పైనే! Also Read: హిట్లు కోసం ప్లాప్ హీరోగారి పాట్లు ! అయితే.. బుల్లి […]

Written By:
  • Rocky
  • , Updated On : February 10, 2021 / 06:20 PM IST
    Follow us on


    బుల్లి తెర‌పై యాంక‌ర్ గా రాణిస్తున్న ర‌వి గురించి స్పెష‌ల్ గా ఇంట్రుడ్యూస్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. త‌న‌దైన మాట తీరుతో.. పంచ్ ల‌తో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లేందుకు సీరియ‌స్ గా ట్రై చేస్తున్నాడు ర‌వి. కేవ‌లం టీవీ షోస్ లోనే కాకుండా.. సినిమా వేడుకల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అయితే.. రవి జోష్ కనిపించేది మాత్రం స్మాల్ స్క్రీన్ పైనే!

    Also Read: హిట్లు కోసం ప్లాప్ హీరోగారి పాట్లు !

    అయితే.. బుల్లి తెర‌పై ఇప్పుడు ర‌వికి మాంచి జోడీగా మారింది యాంక‌ర్ వ‌ర్షిణి. కొంత కాలంగా వీరిద్ద‌రూ ఏ రేంజ్ స్టార్ డమ్ తో దూసుకెళ్తున్నారో అందరికీ తెలిసిందే. మొద‌ట్లో.. పటాస్ షోను శ్రీముఖి – రవి కలిసి ర‌న్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబోలో ఈ షో ఫుల్ సక్సెస్ అయ్యింది. అయితే.. ఈ షో పీక్స్‌లో ఉండగానే.. శ్రీముఖి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లింది.

    దీంతో.. ప‌టాస్ ప్రోగ్రామ్ కు మ‌రో క్వీన్ అవ‌స‌ర‌మైంది. అయితే.. ప‌టాస్ లో ఫ‌న్ ఏ మాత్రం మిస్ మ్యాచ్ కాకుండా.. ఫిక్స్ చేయడానికి నేనున్నానంటూ దూసుకొచ్చింది వ‌ర్షిణి. కానీ.. శ్రీముఖి యాంక‌రింగ్ ను వ‌ర్షిణి రీప్లేస్ చేయ‌గ‌లుగుతుందా? అని సందేహించారు చాలా మంది. బట్.. అంద‌రి అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేస్తూ దూసుకెళ్తోంది ర‌వి – వ‌ర్షిణి జోడీ. అంతేకాదు.. అప్ప‌టి క‌న్నా ఇప్పుడు ప‌టాస్ షో మరింత జోష్ తో ర‌న్ అవుతోంది.

    అలా మొద‌లైన వీరిద్ద‌రి స్నేహం, ఆన్ స్క్రీన్ మాత్ర‌మే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లోనూ కంటిన్యూ అవుతోంది. వృత్తిపరంగానే కాకుండా వీరిద్ద‌రూ వ్యక్తిగతంగానూ సన్నిహితంగా ఉంటున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా వీరంతా కలిసి సందడి చేస్తుంటారు. ఇలా ఉన్న వ‌ర్షిణి.. ర‌వికి సంబంధించిన ఓ వాట్సాప్ చాట్‌ బ‌య‌ట పెట్టేసింది.

    Also Read: ఆసక్తికరమైన బ్యాక్‌ డ్రాప్‌ తో మహేశ్‌ – రాజమౌళి మూవీ !

    లేటెస్ట్ గా వర్షిణి చేసిన ఈ పనికి యాంకర్ రవి త‌ల ప‌ట్టుకున్నాడు. ఇద్ద‌రూ ఒకే షోలో చేస్తున్నారు.. పైగా ఫ్రెండ్స్ కాబ‌ట్టి, ఫోన్లో మాట్లాడుకోవ‌డం.. వాట్సాప్ లో చాట్ చేసుకోవ‌డం కామ‌న్‌. అలా ర‌వి పెట్టిన వాట్సాప్ మెసేజ్ ను వ‌ర్షిణి లీక్ చేసింది. ఆ స్క్రీన్ షాట్ లో ఏముందంటే..

    ముందుగా ర‌వి ఏదో వాయిస్ మెసేజ్ పంపించాడు. దానికి ఓకే అని చెప్పింది వర్షిణి. ఆ తరువాత రవి మరో మెసేజ్ చేశాడు. అదేంటంటే.. ‘హై హీల్స్ వేసుకోకు ప్లీజ్’ అని ఉంది. దీంతో.. ఈ విషయాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పెట్టేస్తా అని చెప్పిన వర్షిణి.. నిజంగానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి ‘పొట్టి వాళ్ల కష్టాలు’ అని రాసుకొచ్చింది వర్షిణి.

    అయితే.. ఈ వాట్సప్ చాట్‌ను వర్షిణి బయటపెడుతుందని రవి అనుకోలేదు కావొచ్చు. తీరా చూసి.. నిజంగానే బయటపెట్టేవా? అని త‌ల ప‌ట్టుకున్నాడు. అంతేకాదు.. వ‌ర్షిణికి కౌంట‌ర్ కూడా వేశాడు. ‘షోలో ఎంట్రీ సాంగ్ చేయాల్సి వస్తుంది కాబట్టి, హై హీల్స్ వేసుకోవద్దు అని చెప్పాను. నీకు ఇలా అర్థమైందా? అంటూ రివర్స్ పంచ్ వేశాడు రవి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్