https://oktelugu.com/

Anchor Rashmi Gautam: రేయ్ భాజపాతో సమస్య ఉంటే… నాతో గొడవెందుకు రష్మీ వైరల్ కామెంట్స్

రష్మీ పెట్టిన ఒక పోస్ట్ కి నెటిజన్లు ఇస్తున్న కౌంటర్లు వారికి రష్మీ ఇస్తున్న రీ కౌంటర్ లతో సోషల్ మీడియా లో ఫెన్స్ తో రష్మీకి చిన్నపాటి రచ్చ జరుగుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : September 12, 2023 / 12:40 PM IST

    Anchor Rashmi Gautam

    Follow us on

    Anchor Rashmi Gautam: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ “సనాతన ధర్మం” మీద చేసిన వ్యాఖ్యలు చుట్టూనే దేశ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇరు పక్షాలు కూడా ఈ వివాదాన్ని రాజకీయం చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే రచ్చ కనిపిస్తుంది. ఈ వివాదం సెగ బుల్లితెర యాంకర్ రష్మీ కి గట్టిగానే తగిలింది.

    రష్మీ పెట్టిన ఒక పోస్ట్ కి నెటిజన్లు ఇస్తున్న కౌంటర్లు వారికి రష్మీ ఇస్తున్న రీ కౌంటర్ లతో సోషల్ మీడియా లో ఫెన్స్ తో రష్మీకి చిన్నపాటి రచ్చ జరుగుతుంది. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు నేపథ్యంలో గతంలో కొందరు నేతలు సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “నా సనాతన ధర్మాన్ని నేను పాటిస్తున్న, దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఆలా విమర్శిస్తున్నారంటే మీ అజెండాలు వేరే ఉన్నాయి ” అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వ్యాఖ్యానించాడు.

    దానికి సంబంధించిన వీడియోను ఎవరో ఎక్స్ (ట్విట్టర్ ) లో పోస్ట్ చేశారు. దానికి రష్మీ స్పందిస్తూ హార్డ్ హాండ్స్ (బాగుందని అర్థం వచ్చేలా ) ఒక ఎమోజీని జోడించింది. ఇప్పుడు అదే వైరల్ అయ్యి, ఒక వివాదానికి దారి తీసింది. ఆమె కనీసం ఎలాంటి కామెంట్ పెట్టకుండా కేవలం ఎమోజీని పెట్టిన కానీ కొందరు ఆమెను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. “డియర్ రష్మీ మీ ధర్మ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆ పేరుతో భాజపా ఎన్నో నేరాలు చేస్తుంది. మతం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తుంది. మణిపూర్ సంఘటనలను ఒక్కసారి చూడండి ” అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

    దానికి కౌంటర్ ఇస్తూ రష్మీ కూడా కామెంట్స్ చేయడంతో మొదలైంది రచ్చ. ఒక దశలో మీకు భాజపాతో సమస్య ఉంటే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ రష్మీ అసహనం వ్యక్తం చేసిన కానీ ఈ కామెంట్స్ ఆగడం లేదు. అదే సమయంలో ఒక నెటిజన్ ” రష్మీ.. మీరు సమయం వృథా చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు పరిస్థితులను బట్టి మారుతుంటారు. వాళ్ళకి నిలకడ ఉండదు ” అంటూ పోస్ట్ చేశాడు. దానిని రష్మీ రీ ట్వీట్ చేయటం విశేషం. అదే సమయంలో తనను టార్గెట్ చేస్తున్న వాళ్లందరికీ కౌంటర్ రిప్లై లు ఇస్తుంది రష్మీ .