Jabardasth
Jabardasth: సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష.. జబర్దస్త్ షోకి వచ్చి పాప్యులర్ అయ్యారు. సాధారణంగా జబర్దస్త్ లో లేడీ గెటప్స్ అబ్బాయిలు వేస్తారు. వాళ్ళ లుక్ ని తట్టుకోవడం కష్టమే. లేడీ జబర్దస్త్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఈ క్రమంలో వర్ష ఎంట్రీ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. చక్కని మేని ఛాయ, నాజూకుగా ఉండే వర్షను జబర్దస్త్ ఆడియన్స్ అంగీకరించారు. వర్ష అతికొద్ది కాలంలో ఫేమ్ రాబట్టింది.
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియల్ తో వర్ష లవ్ ట్రాక్ సైతం సూపర్ సక్సెస్. ఇమ్మానియేల్ పై వర్ష ఎనలేని ప్రేమ చూపించేది. అసలు ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం అంటుంది. ఎవరేమన్నా.. ఇమ్మానియేల్ ని వదిలేదని అనేది. రష్మీ-సుడిగాలి సుధీర్ మాదిరి.. వర్ష-ఇమ్మానియేల్ బుల్లితెర లవ్ బర్డ్స్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అప్పుడప్పుడు వీరికి మనస్పర్థలు కూడా వచ్చేవి.
ఒక్కోసారి వర్షను ఇమ్మానియేల్ ఆటపట్టిస్తాడు. ఆమెను కూడా లేడీ గెటప్ అంటాడు. ఈ విషయంలో ఇమ్మానియేల్ పై వర్ష ఫైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వర్ష-ఇమేనియల్ నిజంగా ప్రేమికులా.. కెరీర్ కోసం నటిస్తున్నారా? అనే విషయం పక్కన పెడితే.. వీరిద్దరూ జబర్దస్త్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. కలిసి స్కిట్స్ చేస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో వర్ష, ఇమ్మానియేల్ భార్య భర్తలు పాత్రలు చేశారు.
ఈ స్కిట్ లో భార్యను అనుమానించే భర్తగా ఇమ్మానియేల్ పాత్ర ఉంది. ఈ క్రమంలో వర్ష… అగ్ని గుండంలో దూకి నా పాతివ్రత్యం నిరూపించుకుంటాను.. అని వర్ష అంటుంది. ఈ డైలాగ్ కి యాంకర్ రష్మీ గౌతమ్ స్పందించింది. ఒసేయ్.. కాలిపోతావే.. అని కౌంటర్ ఇచ్చింది. పరోక్షంగా.. నువ్వు పతివ్రతవు కాదు. కాబట్టి మంటల్లో దూకితే కాలిపోతావని.. చెప్పింది. ఇది నిజంగా వర్ష క్యారెక్టర్ ని రష్మీ కించపరచడం కాదు. కామెడీ కోసం అలా పంచ్ వేసింది.
ప్రస్తుతం శివాజీ, కుష్బూ జడ్జెస్ వ్యవహరిస్తున్నారు. కాగా అనసూయ, రోజా, నాగబాబు వంటి స్టార్స్ జబర్దస్త్ వదిలేసేకా ఆదరణ తగ్గింది. ఒకప్పటి వైభవం లేదు. జబర్దస్త్ లో అందరూ కొత్త కమెడియన్స్ ఉన్నారు.
Web Title: Anchor rashmis shocking comment on jabardast varshas character
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com