Rashmi Gautam: బుల్లితెర మీద తన అందంతో ఆకట్టుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన రష్మీ, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ముందుకు సాగుతుంది. ఈటీవీ లో బాగా ఫేమస్ అయిన జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా యాంకర్ గా చేస్తూ అలరిస్తుంది.
ఇక బుల్లితెర జంట అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు సుధీర్ – రష్మీ. ఏ ముహూర్తాన ఈ జోడి జత కట్టిందో కానీ,దాదాపు ఏడెనిమిదేళ్ల నుండి సక్సెస్ ఫుల్ జోడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెరమీద సుధీర్ – రష్మీ కనిపిస్తే చాలు TRP మోత మోగాల్సిందే. ఒక దశలో వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు. కానీ ఇప్పటికి కూడా వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఇక రష్మీ రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన డాన్స్ చేసే అవకాశాన్ని పొందింది. ఇక కన్నడ లో సూపర్ హిట్ గా నిలిచి తెలుగులో రీమేక్ చేసిన “బాయ్స్ హాస్టల్” సినిమాలో నటిస్తుంది రష్మీ. ఆగష్టు 25 న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. పైగా అన్నపూర్ణ బ్యానర్ మీద ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన ఈవెంట్ లో రష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
హార్డ్ బ్రేక్ గురించి మాట్లాడుతూ “ప్రతి ఒక్కరి లైఫ్ లో రిలేషన్ షిప్స్, హార్డ్ బ్రేక్స్ అనేవి చాలా ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు చాలా మంది ఇలాంటివి చూస్తూనే ఉంటారు. నా బ్రేకప్స్ గురించి కౌంట్ చేసి చెప్పటం చాలా కష్టం అంటూ చెప్పింది రష్మీ. దీన్ని బట్టి చూస్తే రష్మీ లైఫ్ లో చాలానే లవ్ స్టోరీలు, అదే స్థాయిలో బ్రేకప్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.