Ramya Krishnan: వెటరన్ హీరోయిన్ రమ్యకృష్ణను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్ లో ఒక్కప్పటి గ్లామరస్ పాత్రలకు,పవర్ఫుల్ పాత్రలకు పెట్టింది పేరు ఆమె. అలాగని మిగతా పాత్రలు చేయలేదని కాదు.. అందరి హీరోయిన్స్ మాదిరి అన్ని రోల్స్ చేసింది. కానీ మిగతా హీరోయిన్స్ కు సాధ్యం కానీ కొన్ని ప్రత్యేకమైన పాత్రలు కేవలం రమ్యకృష్ణ మాత్రమే చేయగలదు.
రమ్యకృష్ణ కెరీర్ లోనే చెప్పుకోదగిన సినిమా నరసింహ. రజినీకాంత్ కి పోటా పోటీగా నటిస్తూ నీలాంబరి అనే పాత్రకు ప్రాణం పోసింది రమ్యకృష్ణ. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి, నీలాంబరి పాత్ర గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ “నిజానికి ఆ రోల్ చేయాలనీ నాకు లేదు. సౌందర్య పోషించిన పాత్ర నాకు ఇష్టం. కానీ డైరెక్టర్ నాలో ఏమి వైల్డ్ చూశాడో కానీ, నీలాంబరి పాత్ర చేయాల్సిందే” అంటూ ఒప్పించాడు.
ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో నేను సౌందర్య తలపై నా కాళ్లతో టచ్ చేయాలి. దానికి ముందు నేను ఒప్పుకోలేదు, కానీ డైరెక్టర్ కచ్చితంగా చేయాల్సిందే అని చెప్పటంతో నేను చేశాను. ఆ సన్నివేశం చేసిన రోజు నేను చాలా ఏడ్చాను. సెట్ లో సౌందర్య కు సారీ కూడా చెప్పను. ఇప్పటికి దాన్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. కానీ అది చేసింది నేను కాదు, నీలాంబరి పాత్ర అని సర్ది చెప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ.
హీరోయిన్ గా సినిమాలు తగ్గించిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన రోల్స్ చేస్తుంది. నీలాంబరి పాత్ర తర్వాత ఆమెకు అంతటి గుర్తింపు తెచ్చిన పాత్ర శివగామి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివగామి గా రమ్యకృష్ణ నటన నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా తర్వాత రామకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ స్పీడ్ లో దూసుకెళ్తుంది. తాజాగా సూపర్ హిట్ అయిన జైలర్ మూవీ లో రజినీకాంత్ భార్య గా నటించి మంచి మార్కులు సొంతం చేసుకుంది రమ్యకృష్ణ.