India: ప్రపంచంలో పెద్దన్నగా చలామణి అవుతున్న దేశం అమెరికా. అనేక చిన్న చిన్న దేశాలను ఇప్పటికే తమ చెప్పు చేతల్లో పెట్టుకుంది. మాట వినని దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేసింది. తమ అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసి వారిని తమ సామంతులుగా మార్చుకుంది. ఇరాక్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉక్రెయిన్, తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా అమెరికా జోక్యంతోనే ప్రభుత్వాలు కూలాయి. ఇంధన వనరుల కోసం గల్ఫ్ దేశాల్లో చిచ్చు పెట్టింది. యూరప్‌పై పట్టు కోసం రష్యాపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో మెజారిటీ దేశాలు అమెరికా మద్దతులోనే పాలన సాగిస్తున్నాయి. తాజాగా అమెరికా బాటలోనే పయనిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా.. తమ చుట్టూ ఉన్న చిన్నచిన్న దేశాలను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంక ప్రభుత్వాన్ని కూల్చింది. వియత్నాంలో జోక్యం చేసుకుంటోంది. తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోవడం వెనుక చైనా కుట్ర ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆసియాలో చైనాకు దీటుగా ఎదుగుతున్న భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా ఈ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌తో గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న చైనా.. ఇప్పుడు పాకిస్తాన్‌తో కలిసి భారత్ మిత్ర దేశమైన బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కూల్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు భారత్‌పై దృష్టి…
తాజాగా భారత ప్రభుత్వాన్ని కూల్చాలని డ్రాగన్ కంట్రీ చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బంగ్లాదేశ్ తరహాలో దేశంలో అల్లర్లు సృష్టించాలని ఇప్పటికే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అంశం, ఎస్సీ వర్గీకరణ, అగ్నివీర్‌పై ఆందోళనలు.. రైతు ఉద్యమాలు ఇవన్నీ చైనా ప్రోత్సాహంతోనే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు ఏపీలోని అధికార టీడీపీని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని కూల్చాలని డ్రాగన్ కంట్రీ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జరుగబోయే పరిణామాలను పసిగట్టిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కర్ణాటకలో జేడీఎస్‌తో, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండు పార్టీలను ఎన్డీఏలో చేర్చుకున్నారు. దీంతో ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలనుకున్న చైనా వ్యూహం ఫలించలేదు.
ఇప్పుడు ఏపీ సెంట్రిక్‌గా..
ఆందోళనల ఫలితంగా ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గింది. 2014లో 283, 2019లో 303 సీట్లు సాధించిన బీజేపీ 2024 ఎన్నికల్లో 234 సీట్లకే పరిమితమైంది. దీంతో బీహార్‌లోని జేడీయూ, ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ తరహాలోనే భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రష్యాకు చెందిన స్పుత్నిక్ సంస్థ చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనం రేపుతోంది. ప్రస్తుత పరిస్థితిలో జేడీయూ కేంద్రం నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీలోని టీడీపీతో కలిసి మోదీ ప్రభుత్వాన్ని పడగొట్టి.. ఇండియా కూటమిని అధికారంలోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పోస్టే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే టీడీపీ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు. కానీ, చైనా మాత్రం తమ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లర్లు సృష్టించేలా..
చైనా కుట్రలో భాగంగానే దేశంలో అల్లర్లు కూడా సృష్టించే అవకాశం ఉంది. త్వరలో జరిగే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు, హరియానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలనూ ప్రభావితం చేయాలని భావిస్తోంది. మొత్తంగా దేశంలో అశాంతి సృష్టించడం ద్వారా మోదీ ప్రభుత్వం విఫలమైందన్న భావన ప్రజల్లో తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రజల్లో కేంద్రంపై వ్యతిరేకత తీసుకురావాలన్న ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి.