Anchor Anasuya: అనసూయ అంటే అల్ట్రా మోడ్రన్ యాంకర్. బుల్లితెర యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్. తెలుగు యాంకర్స్ పద్దతిగా ఉండాలి, నిండైన బట్టలు ధరించాలనే రూల్ బ్రేక్ చేసిన గట్స్ ఉన్న లేడీ. అనసూయ డ్రెస్సింగ్ పై ఎన్ని వివాదాలు తలెత్తాయో మనకు తెలుసు. అయితే ఎవరేమన్నా అనసూయ అసలు తగ్గేది కాదు. పైగా తన పొట్టిబట్టలను విమర్శించే వాళ్ళకు ఓ రేంజ్ లో కౌంటర్లు ఇచ్చేవారు. అనసూయ అందంగా ఉంటుంది. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తన అభిప్రాయం చెప్పాడు. దానికి కూడా అనసూయ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వయసులో పెద్దోడని కూడా చూడకుండా ఇచ్చి పడేసింది.

అలాంటి అనసూయ పూర్తిగా మారిపోయింది. ఆమె ట్రెడిషనల్ లుక్ అదిరిపోయింది. చుడిదార్ ధరించి సాంప్రదాయ మహిళగా మారిపోయారు. ట్రెండీ వేర్స్ లో సూపర్ సెక్సీగా కనిపించే అనసూయ పద్ధతైన బట్టల్లో సరికొత్తగా కనిపించారు. ఐతే అది శాశ్వతం కాదు లెండి. సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉంటుంది కదా… అలా గుడికి వెళ్లేందుకు అనసూయ ట్రెడిషనల్ లుక్ ట్రై చేశారు. ఆమె ఏపీలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిని సందర్శించారు. గుడిలో దేవుని దర్శనం చేసుకుని పూజలు చేశారు.
Also Read: Hero Sharwanand : ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోబోతున్న హీరో శర్వానంద్.. అమ్మాయి డీటెయిల్స్ ఇవే!
ఈ విషయాన్ని అభిమానులతో అనసూయ షేర్ చేశారు. ఈ క్రమంలో అనసూయ నయా లుక్ వైరల్ గా మారింది. అలాగే ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అనసూయ… న్యూ ఇయర్ 2023లో ఫస్ట్ సెల్ఫీ, ఫస్ట్ ఫ్లైట్ ట్రిప్, ఫస్ట్ అసైన్మెంట్ అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం మొదలై వారం కావడం లేదు, అప్పుడే పనిలో బిజీ అయ్యారంటూ… అభిమానులు ఆమె కమిట్మెంట్ ని మెచ్చుకుంటున్నారు.

కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఆమె పూర్తిగా బుల్లితెరకు దూరం అయ్యారు. ఇది ఆమె అభిమానులను నిరాశపరిచే అంశమే. జబర్దస్త్ లో అనసూయ గ్లామర్ ట్రీట్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె కోసమే షో చూసే ఆడియన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి వాళ్ళందరూ అనసూయను తలచుకొని ఊసూరుమంటున్నారు. కాగా అనసూయ పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ మూవీ ఆమె కీలక రోల్ చేశారు. ఆ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది.
[…] Also Read: Anchor Anasuya: పూర్తిగా మారిపోయిన అనసూయ… షాక్… […]