Anasuya: టాలీవుడ్ లో క్రేజీ యాక్టర్ అనసూయ.. హీరోయిన్ కాకపోయినా ఆ రేంజ్ లో పాపులారిటీ ఉంది. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఎన్నో సహాయ పాత్రలతో పాటు కొన్ని సినిమాల్లో కీలకంగా కనిపించింది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే అనసూయ నటనకు మెచ్చి పెద్ద పెద్ద హీరోలు సైతం తమ సినిమాల్లో నటించాలని కోరుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే అనసూయ స్టార్ హీరోల సినిమాల్లో కచ్చితంగా కనిపిస్తుంది. అనసూయ పుష్ప పార్ట్ వన్ లో క్రష్ లేడీగా కనిపించింది. సునీల్ భార్య పాత్రలో పోషించిన ఈమె ఒక రకంగా విలనిజం నటనతో మెప్పించింది. అయితే ఈ సినిమాకు ముందు అల్లు అర్జున్ పక్కన నటించే ఛాన్స్ మిస్ చేసుకుందట. లేకుంటే అనసూయ ఎక్కడో ఉండేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా?
బజర్దస్త్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్నారు. చేతిలో పదుల సంఖ్యల సినిమలో ఆమె ఇప్పుడు బిజీ నటిగా మారిపోయింది. యాంకర్ గా కొనసాగుతూనే ‘క్షణం’ అనే సినిమా ద్వారా వెండితెరపై కనిపించింది. అంతకుముందు కొన్ని సినిమాల్లోసైడ్ రోల్ లో నటించినా మెయిన్ పాత్ర మాత్రం ఆమెకు ‘క్షణం’ మూవీ అని చెప్పవచ్చు. ఇందులో పోలీస్ పాత్రలో నటిపంచిన అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆమె ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశం తెచ్చుకుంది.
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ అమ్మాయికైనా హీరోయిన్ కావాలన్న ఆశ ఉంటుంది. అనసూయ కూడా హీరోయిన్ గా రాణించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే హీరోయిన్ ఛాన్స్ రాకపోయినా ఆ రేంజ్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సహాయ నటిగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్ లో కనిపించి డ్యాన్స్ చేశారు.ఆమె నృత్యంతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించారు. అయితే అనసూయ మంచి మంచి ఛాన్స్ లు మిస్ చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశాలన్ని కోల్పోయింది.
అల్లుఅర్జున్ తో సుకుమార్ ‘ఆర్య 2’ తీస్తున్న సమయంలో అనసూయను సంప్రదించాడట. తమ సినిమాలో నటించాలని కోరాడట. అయితే ఆ సమయంలో ఆమె వివాహ నిశ్చితార్థం చేసుకుందట. ఆ సమయంలో పెళ్లిని కాదని సినిమాల్లో నటిస్తే బాగోదని ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. ఇంతకీ ఆర్య 2లో అనసూయ ఏ పాత్ర మిస్ చేసుకుందనేది మాత్రం తెలియరాలేదు. ఆర్య 2లో మెయిన్ రోల్ లో కాజల్ నటించారు. ఆమె తరువాత పొజిషన్ లో శ్రద్ధా దాస్ నటించారు. అయితే శ్రద్ధాదాస్ ప్లేసు కోసం అడిగారని చర్చించుకుంటున్నారు.