Anasuya Bharadwaj: యాంకర్ అనసూయకు స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ బోల్డ్ బ్యూటీ బుల్లితెర వేదికగా చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 2013లో జబర్దస్త్ ప్రయోగాత్మకంగా మొదలైంది. అనసూయ యాంకర్ గా పరిచయం అయ్యింది. అప్పటి వరకు అనసూయ ఎవరో తెలియదు. అయితే పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ అనతి కాలంలో పాప్యులర్ అయ్యింది. అప్పటి వరకు తెలుగు బుల్లితెరపై గ్లామర్ షో అనే కాన్సెప్ట్ లేదు. సుమ, ఝాన్సీతో పాటు పలువురు టాప్ యాంకర్స్ పద్దతిగా కనిపించేవారు.
అనసూయ ట్రెండ్ సెట్ చేసింది. ఈ క్రమంలో విమర్శలు కూడా ఎదురయ్యాయి. అనసూయ సదరు విమర్శలను ధైర్యంగా తిప్పి కొట్టింది. నా బట్టలు నా ఇష్టం. నాకు నచ్చినట్లు వేసుకుంటా… అడగడానికి మీరు ఎవరని ఆమె గట్టిగానే సమాధానం చెప్పింది. అనసూయ స్ఫూర్తితో రష్మీ గౌతమ్, శ్రీముఖి, వర్షిణ, దీపికా పిల్లి, విష్ణుప్రియ లాంటి వాళ్ళు బోల్డ్ యాంకర్స్ గా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు.
అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ తో పాటు ఆమె చేస్తున్న అన్ని షోల నుండి తప్పుకుంది. నటనపై దృష్టి పెట్టింది. టీఆర్పీ కోసం షోల నిర్మాతలు చేసే స్టంట్స్ నచ్చకే యాంకరింగ్ మానేస్తున్నాని ఇటీవల వెల్లడించింది. అదే సమయంలో నటిగా, యాంకర్ గా రెండు బాధ్యలు నెరవేరుస్తుంటే… ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే నటనకు పరిమితం అయ్యాయని అనసూయ మరో కారణంగా చెప్పారు.
అనసూయ నటిగా ఫుల్ బిజీ. ఈ ఏడాది అరడజను చిత్రాల వరకు అనసూయ చేసింది. ఆమె నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాల్లో అనసూయ విలక్షణ రోల్స్ చేసింది. అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ ద్వారా లక్షలు సంపాదిస్తుంది. ఇటీవల ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన అనసూయ డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. సరికొత్తగా ఉన్న అనసూయను చూసి ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.