https://oktelugu.com/

సారీ చెప్పినా వ‌ద‌ల్లేదుగా.. ఎన్ కౌంట‌ర్ చేసిన అనసూయ‌!

అటు బుల్లితెరపై, ఇటు వెండి తెర‌పై ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాను మాత్రం మిస్ చేసుకోదు అన‌సూయ‌. వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోపాటు సామాజిక అంశాలపైనా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటూ ఉంటారు. అయితే.. ఇత‌ర సెల‌బ్రిటీల మాదిరిగా పోస్టు చేసి ఊరుకోవ‌డం కాదు.. ఆ పోస్టుల‌కు వ‌చ్చే కామెంట్ల‌ను కూడా సీరియ‌స్ గా తీసుకుంటూ, రిప్లే కూడా ఇస్తుంటారు అన‌సూయ‌. Also Read: ప‌వ‌న్ – మ‌హేష్‌.. రెమ్యునరేషన్ లో ఎవరు నెంబర్ 1? అయితే.. సాధార‌ణంగా చర్చిస్తే […]

Written By:
  • Rocky
  • , Updated On : February 20, 2021 / 05:28 PM IST
    Follow us on


    అటు బుల్లితెరపై, ఇటు వెండి తెర‌పై ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాను మాత్రం మిస్ చేసుకోదు అన‌సూయ‌. వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోపాటు సామాజిక అంశాలపైనా త‌న అభిప్రాయాల‌ను పంచుకుంటూ ఉంటారు. అయితే.. ఇత‌ర సెల‌బ్రిటీల మాదిరిగా పోస్టు చేసి ఊరుకోవ‌డం కాదు.. ఆ పోస్టుల‌కు వ‌చ్చే కామెంట్ల‌ను కూడా సీరియ‌స్ గా తీసుకుంటూ, రిప్లే కూడా ఇస్తుంటారు అన‌సూయ‌.

    Also Read: ప‌వ‌న్ – మ‌హేష్‌.. రెమ్యునరేషన్ లో ఎవరు నెంబర్ 1?

    అయితే.. సాధార‌ణంగా చర్చిస్తే ఓకే, కానీ.. నెగెటివ్ కామెంట్స్ చేస్తే మాత్రం అస‌లు జీర్ణించుకోలేరు అన‌సూయ‌. ఇలాంటి సంద‌ర్భాలు గ‌తంలో చాలా సార్లు ఎదురైన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. మ‌రోసారి ఓ నెటిజ‌న్ పై ఘాటుగా స్పందించారు అన‌సూయ‌. అయితే.. అత‌ను సారీ చెప్పినా.. విడిచి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం!

    ఇంత ర‌చ్చ జ‌ర‌గ‌డానికి కార‌ణం ఏమంటే..? ఇటీవ‌ల లంగావోణితో కూడిన ఓ పిక్ ను త‌న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో పోస్టు చేశారు అన‌సూయ. చాలా మంది సూప‌ర్‌.. అద్భుతం అని కామెంట్ చేయ‌గా.. ఓ నెటిజ‌న్ మాత్రం నెగెటివ్ కామెంట్ చేశాడు. ‘అ ఆ’ సినిమాలోని సమంతతో కంపేర్ చేస్తూ.. ‘నువ్వు ఏమైనా సమంత అనుకుంటున్నావా?’ అంటూ ఓ మీమ్ ను కామెంట్ గా పోస్టు చేశాడు.

    Also Read: ఏపీకి చిరంజీవి.. ఊగిపోతున్న ఫ్యాన్స్

    ఈ కామెంట్ అన‌సూయ ఇగోను తీవ్రంగా దెబ్బ‌తీసిన‌ట్టుంది. కోపాన్ని ఏ మాత్రం అణ‌చుకోలేక‌పోయిన అనసూయ.. ‘అయ్యో లేదమ్మా.. నన్ను అనసూయ అంటారు’ అని జవాబు ఇచ్చింది. దీంతో అనసూయకు కోపం వ‌చ్చింద‌ని స‌ద‌రు నెటిజ‌న్ గ్ర‌హించాడు. ‘క్షమించండి మేడమ్‌.. ఆట పట్టించడం (Kidding) కోసం నేను సరదాగా కామెంట్ చేశాను’ అని రిప్లే ఇచ్చాడు.

    అయిన‌ప్ప‌టికీ.. అత‌న్ని విడిచిపెట్ట‌లేదు అన‌సూయ. మ‌రో ఘాటు కామెంట్ పెట్టిగానీ.. ఆ సెష‌న్ కంప్లీట్ చేయ‌లేదు. ‘నాకర్థమైంది నువ్వు మాన‌సికంగా చిన్నపిల్లాడివేనని(‘KID’DING). త్వరలో నువ్వు ఎదగాలని నేను కోరుకుంటున్నా’ అని ఎన్ కౌంటర్ చేసింది. ఎంత‌గా హ‌ర్ట్ కాక‌పోతే.. ఈ స్థాయిలో కౌంట‌ర్ ఇస్తుందో అని మాట్లాడుకుంటున్నారు నెటిజ‌న్స్‌.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్