Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya Husband: మా ఆయన కూడా అలాంటివాడే, పర్ఫెక్ట్ కాదు, గొడవలు అయ్యాయి... అనసూయ...

Anchor Anasuya Husband: మా ఆయన కూడా అలాంటివాడే, పర్ఫెక్ట్ కాదు, గొడవలు అయ్యాయి… అనసూయ సంచలనం

Anchor Anasuya Husband: అనసూయ భర్త చాలా మంచివాడు. ఆమెకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమె ఎలాంటి బట్టలు ధరించినా, ఎలాంటి పాత్రలు వేసినా అడ్డు చెప్పడు.. అనే భావన జనాల్లో ఉంది. కానీ అది తప్పు అంటుంది అనసూయ. నా భర్త కూడా అందరి మగాళ్ళ లాంటి వాడే. కొందరితో సన్నిహితంగా ఉండటం ఆయనకు నచ్చదు. ఈ క్రమంలో గొడవలు అయ్యాయని ఓపెన్ అయ్యింది.

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ) ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. స్కూల్ డేస్ లో మొదలైన వీరి ప్రేమ ఏళ్ల తరబడి సాగిందట. పెద్దలు మొదట్లో పెళ్ళికి అంగీకరించలేదట. ముఖ్యంగా అనసూయ తండ్రి తీవ్ర అభ్యంతరం చెప్పాడట. అనసూయ ఒక దశలో లేచి పోయి పెళ్లి చేసుకుందాం అందట. అయితే పెద్దల అంగీకారం తర్వాతే పెళ్లి అని సుశాంక్ పట్టుబట్టాడట. ఎట్టకేలకు పేరెంట్స్ వారిని ప్రేమను అర్థం చేసుకుని పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.

Read Also: ఏపీ లిక్కర్ స్కాం: నో(కో)ట్ల ‘కట్టల’ పాములు బయటపడ్డాయి

అనసూయ డ్రెస్సింగ్, యాటిట్యూడ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక వేశ్య పాత్ర చేసిన అతికొద్ది మంది నటుల్లో అనసూయ ఒకరు. అనసూయ ఇంత స్వేచ్ఛగా ఎలా ఉంటుంది? ఆమె భర్త అభ్యంతరం చెప్పరా? అనే సందేహాలు జనాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో సుశాంక్ అబాసుపాలు అయ్యాడు కూడాను. అయితే అందరూ అనుకున్నట్లు సుశాంక్ పర్ఫెక్ట్ కాదు అంటుంది అనసూయ. తాజా ఇంటర్వ్యూలో భర్తను ఉద్దేశిస్తూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

అనసూయ మాట్లాడుతూ… నా భర్త చాలా పర్ఫెక్ట్, అనసూయను అన్నీ చేయనిస్తాడు. ఏమీ అనడు అనుకుంటారు. అది నిజం కాదు. ఆయన వీక్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మా మధ్య గొడవలు అయ్యాయి. నేను కొంత మందిని కలవడం, కొందరితో సినిమాలు చేయడం ఆయనకు నచ్చదు. పెద్ద స్టార్స్, గుడ్ లుకింగ్ పీపుల్ తో సన్నిహితంగా ఉంటే తీసుకోలేరు. ఎవరైనా నన్ను ఫ్లర్ట్ చేసినా, కాంప్లిమెంట్ ఇచ్చినా మా ఆయనకు నచ్చేది కాదు. మా ఆయనను చాలా మంది చేతకాని వాడు అని విమర్శిస్తారు. అయితే ఆయనకు తెలుగు రాదు.

Read Also: సరిదిద్దిన ఆంధ్రప్రదేశ్ జిల్లాల పుట్టుపూర్వోత్తరాలు మరోసారి

సోషల్ మీడియాలో నాపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కి నేను రియాక్ట్ అయితే.. ఎవరో అన్నదానికి నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావ్ అంటాడు. నేను మా ఆయన వద్ద కూడా ఇన్ సెక్యూర్ గా ఉంటాను. పెళ్లి అనేది పర్ఫెక్ట్ కాదు. ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నేను ఆయనకు రైట్ నాకు ఆయన రైట్. చూసే వాళ్లకు రైట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మన దేశంలో వివాహ వ్యవస్థ చాలా విలువైనది. విడాకుల వలన ఆ విలువను తగ్గిస్తున్నాం. సర్దుకుపోవడం ద్వారానే బంధాలు నిలబడతాయి… అని అనసూయ చెప్పుకొచ్చారు.

Exit mobile version