Anasuya Bharadwaj : జబర్దస్త్ షో వేదికగా అనసూయ సంచలనాలు చేసింది. ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో సినిమాల్లో అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. అనసూయ సినిమాల పైనే పూర్తి దృష్టి పెట్టింది. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తుంది. అనసూయ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటూ, వాంటెడ్ యాక్ట్రెస్ గా మారింది.
కాగా 38 ఏళ్ల వయసులో కూడా అనసూయ ఫిట్నెస్ మైంటైన్ చేస్తుంది. ఆమె గ్లామర్ మామూలుగా ఉండదు. హీరోయిన్లతో పోటీ పడుతూ కుర్రాళ్లతో అదరహో అనిపించుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. టైం దొరికినప్పుడల్లా భర్త, పిల్లలతో కలిసి వెకేషన్స్ వెళ్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా చీర కట్టులో దర్శనమిచ్చింది. సోయగాల ప్రదర్శనతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫ్యాన్స్ మీరు చాలా అందంగా ఉన్నారని కితాబు ఇస్తున్నారు. రజాకార్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి అనసూయ ఇలా చీర కట్టుకుని హాజరైంది. సదరు పోస్ట్ కి కామెంట్ గా… రజాకార్ ట్రైలర్ చూశారా? అని పెట్టింది. సాంప్రదాయ కట్టులో కూడా అనసూయ లుక్ మనసులు దోచేస్తుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయను ఇన్ స్టాగ్రామ్ లో 1.4 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే… రజాకార్ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు.ఈ పీరియాడిక్ మూవీ మార్చి 1న థియేటర్స్ లోకి రానుంది. అలాగే పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో మరోసారి లేడీ విలన్ గా అలరించనుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.