Homeఎంటర్టైన్మెంట్Anasuya: బుల్లితెర పైకి అనసూయ రీఎంట్రీ... కలర్ ఫుల్ ప్రోమో అదిరింది చూశారా?

Anasuya: బుల్లితెర పైకి అనసూయ రీఎంట్రీ… కలర్ ఫుల్ ప్రోమో అదిరింది చూశారా?

Anasuya: అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెప్పి రెండేళ్లు అవుతుంది. 2022లో ఆమె జబర్దస్త్ ని వీడింది. అనసూయ నిర్ణయం అభిమానులను నిరాశకు గురి చేసింది. దాదాపు 9 ఏళ్ళు అనసూయ జబర్దస్త్ యాంకర్ గా ఉన్నారు. ఆమె గ్లామర్ అండ్ ఎనర్జీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. జబర్దస్త్ వేదికగా స్టార్ గా ఎదిగిన అనసూయకు సినిమా ఆఫర్స్ ఎక్కువగా రావడంతో యాంకరింగ్ ని వదిలేసింది. డేట్స్ కుదరకపోవడం వలనే జబర్దస్త్ వదిలేశానని అనసూయ మొదట్లో చెప్పారు.

అనంతరం మెల్లగా తన ఆవేదన వెళ్లగక్కింది. జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. కమెడియన్స్ తనపై వేసే జోక్స్ కి ఆమె కోప్పడినా కూడా అది ఎడిటింగ్ లో తీసేసేవారట. మరొక కారణంగా… టీఆర్పీ స్టంట్స్ అని అనసూయ చెప్పారు. ఆన్లైన్ చాట్ లో యాంకరింగ్ ఎందుకు మానేశారు? మరలా ఎప్పుడు వస్తారు? అని అడగ్గా.. మేకర్స్ టీఆర్పీ స్టంట్స్ నాకు నచ్చడం లేదు. అందుకే యాంకరింగ్ వదిలేశాను. ఈ సంస్కృతి పోయినప్పుడు మరలా వస్తాను, అన్నారు.

Also Read: Dhee Celebrity Special: హైపర్ ఆది కామెంట్స్ కి హర్ట్ అయిన హీరోయిన్ హన్సిక… అందరి ముందే స్ట్రాంగ్ వార్నింగ్

ఇంకో సందర్భంలో… యాంకరింగ్-యాక్టింగ్ చేయడం వలన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే యాంకరింగ్ వదిలేసి పూర్తి దృష్టి నటనపై పెట్టానని ఆమె అన్నారు. కట్ చేస్తే.. త్వరలో ప్రారంభం కాబోతున్న ఓ గేమ్ షో ప్రోమోలో అనసూయ కనిపించింది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ పేరుతో స్టార్ మా ఓ ప్రోమో విడుదల చేసింది.

Also Read: Indraja: ఇంద్రజ జబర్దస్త్ వదిలేస్తే… ఆమె స్థానంలోకి వచ్చేది ఎవరు?

సాంగ్ లా డిజైన్ చేసిన ఈ ప్రోమోలో అనసూయ, శేఖర్ మాస్టర్, అమర్ దీప్, ప్రియాంక సింగ్, శోభా శెట్టి, టేస్టీ తేజ, విష్ణుప్రియతో పాటు కొందరు సీరియల్ నటులు కనిపించారు. ఇది ఓ గేమ్ షో కాగా ప్రోమో అదిరింది. ఈ క్రమంలో అనసూయ రీ ఎంట్రీ ఇచ్చారనే ప్రచారం మొదలైంది. అయితే కేవలం ప్రోమోలో ఆమె నటించారా? లేక యాంకర్/జడ్జిగా వ్యవహరిస్తున్నారా? అనేది మరో ప్రోమో వస్తే కానీ తెలియదు.

RELATED ARTICLES

Most Popular