క్రియేటర్స్ కి కాస్త సెంటిమెంట్స్ ఎక్కువుగానే ఉంటాయి. అందుకేనేమో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ కి కూడా సెంటిమెంట్స్ కాస్త ఎక్కువే. ఇప్పుడు తన సెంటిమెంటే హాట్ యాంకర్ అనసూయకు వరంగా మారింది. ఆమెకి సుక్కు మళ్లీ అదిరిపోయే క్యారెక్టర్ ఇవ్వబోతున్నాడు. ‘రంగస్థలం’ అనే సినిమా సుక్కు కెరీర్లోనే బిగ్గిస్ట్ హిట్, అయితే ఆ హిట్ లో రంగమ్మత్త క్యారెక్టర్ కీలకం. పైగా ఆ పాత్రలో అనసూయ జీవించేసింది.
అందుకే ఆమెను మళ్ళీ పుష్ప సినిమాలో కూడా తీసుకున్నాడు సుక్కు. అయితే ఈ సారి ఆమెకు కల్లు అమ్ముకునే పాత్రను ఇస్తున్నాడట. గిరిజన తెగకు చెందిన మహిళగా అనసూయ పుష్ప సినిమాలో కనిపించబోతుంది. సుకుమార్ ఎలాగూ రంగస్థలం ఫార్ములాని, ఆ సినిమాకి కలిసొచ్చిన హిట్ ఎలిమెంట్స్ ని ‘పుష్ప’ సినిమాలో కూడా రిపీట్ చేస్తున్నాడు కాబట్టి.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త లాంటి క్యారెక్టర్ ను ‘పుష్ప’లో క్రియేట్ చేశాడు.
అలా గిరిజన మహిళగా అనసూయ కనిపిస్తోంది. హీరో గ్యాంగ్ కి కల్లును అమ్ముకుంటూ ఆమె పాత్ర సాగుతుందట. సినిమాలో ఇంటర్వల్ సీక్వెన్స్ కి మెయిన్ లీడ్.. అయితే కేవలం సుకుమార్ తన సక్సెస్ సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకునే అనసూయకి ఆఫర్ ఇచ్చాడని..
లేకపోతే ఆ పాత్రలో మొదట ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారని తెలుస్తోంది. మరి సుక్కు తన సెంటిమెంట్ ను గట్టిగా ఫాలో అవుతున్నాడు కాబట్టి, ఈ ‘పుష్ప’ సినిమాతో కూడా గట్టి హిట్ కొడతాడేమో చూడాలి. ఇక సుక్కు రెమ్యునరేషన్ విషయంలో మరో రూమర్ ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది. పుష్ప సినిమాకి గానూ సుకుమార్ దాదాపు 20 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట.
ఒకవిధంగా సుకుమార్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద రెమ్యునరేషన్. ఇక సుకుమార్ పుష్పకి ఎలాంటి పోటీ లేకుండా డిసెంబర్ లో సినిమాని రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.