అనసూయ క్రేజ్ ప్రస్తుతం హీరోయిన్ల స్థాయిలో ఉంది. అందుకే అనసూయ కోసం ప్రత్యేకంగా తమ కథల్లో పాత్రలను సృష్టిస్తున్నారు మేకర్స్. అయితే, అనసూయ కెరీర్ ను విజయాల పరంపర వైపు మలుపు తిప్పిన సినిమా ‘‘రంగస్థలం’. బుల్లితెర పై కామెడీ ప్రోగ్రామ్స్ లో ఐటమ్ సాంగ్స్ కోసం ఎక్స్ పోజింగ్ చేస్తూ కాలం నెట్టుకొస్తున్న అనసూయకి, రంగమ్మత్త పాత్ర దొరకడం ఆమె అదృష్టం.
అయితే ఆమెకు మళ్ళీ అలాంటి అదృష్టాన్నే ఇవ్వబోతున్నాడు సుకుమార్. ఆమెలో కూడా మంచి నటి ఉందని ప్రూవ్ చేసిన సుక్కు, ఇప్పుడు ఆమెలో మంచి నటి కాదు, మహానటి ఉందని ప్రూవ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం చేస్తోన్న ‘పుష్ప’ చిత్రంలో అనసూయ కోసం సుక్కు ఒక ప్రత్యేక పాత్రను డిజైన్ చేయించాడు.
కాగా ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్ర కన్నా, ‘పుష్ప’ సినిమాలో అనసూయ చేస్తోన్న రోల్ మరింత గొప్పగా ఉంటుందని, ఒకవిధంగా రంగమ్మత్త పాత్ర కంటే గొప్పది అని అనసూయ చెప్పుకొస్తోంది. పైగా పుష్ప కథని మొత్తంగా మలుపు తిప్పే పాత్రలో అనసూయ కనిపించబోతుంది. మొత్తానికి సుకుమార్ అనసూయకి మంచి పాత్రలు ఇస్తున్నాడు.
ఎలాగూ అల్లు అర్జున్ హీరో కాబట్టి, పైగా ఈ సినిమా పాన్ ఇండియా కాబట్టి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా నిలిచిపోయింది. అల్లు అర్జున్ కరోనా సోకడంతో, బన్నీతో షూట్ లో పాల్గొన్న అనసూయ కూడా కొద్దీ రోజులు ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తోంది అనసూయ.