Anasuya: బుల్లితెర యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో అనసూయ ఒకరు. ఈమె యాంకరింగ్ చేస్తే అటెన్షన్ గా ఉండే వారు ఎక్కువ. జబర్దస్త్ ద్వారా మరింత సక్సెస్ ను అందుకొని ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారింది యాంకర్. బుల్లితెర కంటే ఈ అమ్మడు వెండితెరపైనే ఎక్కువ బిజీగా ఉంటుంది. ఒక సినిమాలో కాదు ఎన్నో సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ మరింత క్రేజ్ ను పెంచుకుంటుంది అమ్మడు. ఇక సినిమాల్లో, కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం మరింత ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.
కొన్ని సార్లు సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇలా ఎన్నో సార్లు వార్తల్లో నిలిచింది అనసూయ. అంతేకాదు హీరోలను ఉద్దేశిస్తూ కూడా ఈమె చేసిన పోస్టులు వైరల్ గా మారాయి. అలా వారి అభిమానులకు శత్రువు గా మారింది అమ్మడు. కానీ వీరందరికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతుంటుంది అనసూయ. ఈ విధంగానే కాదు పర్సనల్ విషయాల్లో కూడా ఈమె చాలా స్ట్రాంగ్ అనే విషయం తెలిసిందే. `ఇదిలా ఉంటే రీసెంట్ గా
అనసూయ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటించింది.
ఓ నెటిజన్ మీలాగా ఈ సంవత్సరం మేం కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగారు. దీనికి అనసూయ మూడు విషయాలను తెలియజేసింది. 2023లో నేను మనశ్శాంతి కోసం చాలా వెతికాను. అలాగే నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాను అని తెలిపింది. అంతేకాదు కొన్ని విషయాలకు దూరంగా ఉన్నాను. ఇతరులను అర్థం చేసుకోవడం, గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాను అంటూ తెలిపింది అనసూయ. ఈ మూడు విషయాల గురించి 2023లో ఎక్కువ ఫోకస్ చేశానని.. అందుకే వీటిని నేర్చుకున్నానని.. జీవితంలో ఇవి చాలా అవసరం అంటూ తెలిపింది. ఇక అనసూయ తెలిపిన ఈ విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
అనసూయ పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు సంపాదించింది. ప్రస్తుతం పుష్ప 2లో కూడా నటిస్తుంది. దాక్షాయణి గా నటించిన అనసూయ నెక్ట్స్ పార్ట్ లో కూడా మరింత స్ట్రాంగ్ కంటెంట్ తో రానుందట. మరి ఈ పార్ట్ 2 అను కెరీర్ లో ఎలాంటి ఇంపాక్ట్ ను ఇవ్వనుందో చూడాలి.