Homeఎంటర్టైన్మెంట్Telugu Bigg Boss Non Stop: 'బిగ్ బాస్’ హౌస్‌లో అనసూయ.. నటరాజ్‌ పై ...

Telugu Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అనసూయ.. నటరాజ్‌ పై కోపంతో ‘దుర్గ మాత’గా బిందు మాధవి !

Telugu Bigg Boss Non Stop: చివరి దశకు చేరుకున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’.. నాన్ స్టాప్ గా ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తోంది. లాస్ట్ స్టేజ్ కాబట్టి.. కంటెస్టెంట్లలో కూడా టెన్షన్ ఎక్కవైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా నామినేషన్లలో పైచేయి సాధించడానికి తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల దాడితో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. పైగా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది.

తాజాగా హౌస్ లోకి అనసూయ ఎంట్రీ ఇచ్చి ఊపు పెంచింది. అనసూయ కోసం ‘‘బావొచ్చాడోయ్ మామ..’’ అంటూ నటరాజ్ మాస్టార్ అమ్మాయి వేషం వేశాడు. ఆ పాటకు అమ్మాయిలా నాటు స్టెప్పులతో ఇరగదీశాడు. ప్రోమో స్టార్టింగ్ లో చంద్రముఖిలా నటరాజ్ మాస్టర్ కొత్తగా ట్రై చేశాడు. ఇక ప్రోమో మధ్యలో అనసూయ.. ఆడియన్స్ వేసిన పలు ప్రశ్నలను హౌస్‌ మేట్స్‌ ను అడిగింది.

Telugu Bigg Boss Non Stop
Telugu Bigg Boss Non Stop

అరియానా, అఖిల్‌ ను ఉద్దేశిస్తూ ఫ్యామిలీ వచ్చిన తర్వాత, ఎందుకు బిందుతో క్లోజ్ అయ్యారు ? అంటూ అనసూయ ప్రశ్నించింది. వీటికి అరియానా, అఖిల్‌ ఇచ్చిన రియాక్షన్స్ ప్రోమో పై ఆసక్తిని పెంచాయి. మరి, అనసూయ అడిగిన ప్రశ్నలకు వారు ఏ సమాధానం చెప్పారో చూడాలి.

Also Read: Analysis on Secularist Governments : ప్రపంచంలో సెక్యులరిస్టు ప్రభుత్వాల స్వభావం ఎలా ఉంది?

ఎప్పటిలాగే బిందు, నటరాజ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. నామినేషన్లు సందర్భంగా నటరాజ్ బిందు, బాబా మాస్టర్‌, అరియానాలను నామినేట్ చేశాడు. దాంతో బిందు, నటరాజ్‌ల మధ్య వాగ్వాదం మొదలైంది. దాంతో మెంటల్ ఎక్కిన నటరాజ్ ‘‘నెగటివిటీ కంప్లీట్‌గా ఉన్న ఓన్లీ వన్ పర్శన్ నువ్వు మాత్రమే’ అంటూ బిందు పై విరుచుకుపడ్డాడు.

Telugu Bigg Boss Non Stop
Bindu

‘‘నీ సైడ్ నుంచి ఏమి వచ్చింది ఇన్ని రోజులు? పాజిటివిటీనా?’’ అంటూ బిందు మాధవి తెలివిగా ఎదురు ప్రశ్నించింది. దాంతో నటరాజ్ కెమెరాల వైపు తిరిగి ‘‘ఇప్పటివరకు బిందు చేసినవన్నీ దొంగ నామినేషన్లే’’ అని అన్నాడు. కెమెరాలకు ఎందుకు చెబుతున్నావ్ ? అని బిందు అడిగితే.. ‘‘నీ ఫేస్ చూడలేక, అని, ఇంకా వాయిస్ రైజ్ చేస్తూ ‘‘శూర్పణక నీ టైమ్ ఆసన్నమైంది. ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు’’ అంటూ నటరాజ్ పరిధి దాటాడు.

నటరాజ్ మాస్టర్ ఇలా పిచ్చోడిలా ఆవేశంతో పిచ్చి వాగుడు వాగుతుంటే… బిందు మాధవి మాత్రం ఏమీ మాట్లాడకుండా ‘దుర్గ మాత’ పోజు పెట్టింది. ఓవర్ గా మాట్లాడుతూ ఆవేశపడ్డ నటరాజ్‌ కు బిందు మాధవి అమ్మవారి ఫోజుతో సరైన సమాధానం చెప్పింది.

Also Read: KA Paul Meets Amit Shah: అమిత్ షాతో కేఏ పాల్ భేటీ ఆంతర్యమేమిటో?
Recommended Videos

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular