Divorce: సినిమా వాళ్ల జీవితాలు తెరపైనే చాలా భావోద్వేగంగా ఉంటాయి. నిజ జీవితంలో మాత్రం, అందుకు పూర్తి విరుద్ధంగా చాలా ప్రాక్టికల్ గా ఉంటాయి. దాంపత్య జీవితంలో కాంప్రమైజ్ అయి బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. పిల్లలు వున్నా, ఏ వయసైనా విడిపోవాలని ఆలోచన వస్తే విడిపోవడమే. తాజాగా ‘స్టార్ హీరో సల్మాన్ ఖాన్’ తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా, తన భార్య సీమా ఖాన్ కు విడాకులు ఇవ్వబోతున్నాడు.,

Sohail Khan, Seema Khan
ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట పెళ్లయిన 24 ఏళ్ల అనంతరం విడిపోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ముంబై ఫ్యామిలీ కోర్టులో సోహైల్ ఖాన్ – సీమా ఖాన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. బీటౌన్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. వీరు విడాకులు తీసుకుంటున్నారు అనగానే బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. కారణం వీరిది ప్రేమ వివాహం.
1998లో సోహైల్ ఖాన్- సీమా ఖాన్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. 2000లో ఈ జంటకు నిర్వాన్ ఖాన్ పుట్టాడు. 2011 జూన్ లో సరోగసి ద్వారా రెండో కుమారుడు యోహాన్ కు జన్మనిచ్చారు. గత ఏడాది యోహాన్ 10వ పుట్టిన రోజును కూడా చాలా గ్రాండ్ గా చేశారు. మరి అంతలోనే సోహైల్ – సీమా ఎందుకు విడిపోతున్నారు ?
Also Read: Telugu Bigg Boss Non Stop: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అనసూయ.. నటరాజ్ పై కోపంతో ‘దుర్గ మాత’గా బిందు మాధవి !
విడాకులకు ఇంకా ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, ఈ జంట కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. వాస్తవానికి 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని వార్తలు హల్‌చల్ చేశాయి. సీమా వాటిని ఖండించింది. ఏ బంధం లో అయినా గొడవలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లల భవిష్యత్తే చాలా ముఖ్యమని ఆమె అప్పుడు పేర్కొంది.

Sohail, Seema
దాంతో.. సోహైల్ – సీమా కలిసే ఉంటారని అందరూ భావించారు. కానీ, సడెన్ గా ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడంతో ఈ వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ వార్తతో సల్మాన్ ఖాన్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. సల్మాన్ మరో తమ్ముడు అర్బాజ్ ఖాన్ కూడా ఇప్పటికే అతని భార్య మలైకా అరోరాతో విడిపోయాడు. విడిపోయాడు అనేకంటే.. మలైకా, అర్జున్ కపూర్ తో ప్రేమలో పడి, అర్బాజ్ ఖాన్ ను వదిలేసింది.
సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి మరీ.. గత కొన్నేళ్లుగా అర్జున్ కపూర్ కి ప్రేమ పాఠాలు నేర్పుతుంది. మలైకా వ్యవహారంతోనే సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ చాలా రకాలుగా ఇబ్బందులు పడింది. ఇప్పుడు సోహైల్ ఖాన్ – సీమా ఖాన్ వ్యవహారం కూడా ఆ కుటుంబాన్ని మరింత ఇబ్బంది పెడుతుంది. సల్మాన్ ఫ్యామిలీకి కోడళ్ల గండం ఉందని కొందరు నెటిజన్లు మెసేజ్ లు చేస్తుంటే.. మరికొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం సల్మాన్ కుటుంబంలో కోడళ్ళు ఉండలేరు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Twitter Elon Musk: బ్రేకింగ్: ట్విట్టర్ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం