Anasuya Bharadwaj : బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి స్టార్లు అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ టీవీల్లోనే కొనసాగుతూ సినిమా హీరోయిన్ల కంటే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది యాంకర్లు ఉన్నారు. వీరిలో అనసూయ భరద్వాజ్ ఒకరు. తమ మాటలతో యూత్ తో పాటు మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. ఎప్పుడు సంతోషంగా కనిపించే అనసూయ భరద్వాజ్ టీవీ లతోపాటు సినిమాల్లోనూ కనిపించి సందడి చేశారు. మొదట్లో సినిమాల్లో బ్యాక్ సైడ్ నిల్చున్న ఈమె ఆ తర్వాత టీవీ రంగంలో అడుగు పెట్టారు. యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లతో సమానంగా ఇమేజ్ సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఈమె కొత్త ఇల్లును కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
Also Read : రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ విషయం లో ‘ఖలేజా’ ఆల్ టైం రికార్డ్!
రంగమ్మత్తగా.. అనసూయగా పలు రకాల పేర్లతో ఎంతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఏజ్ బార్ అయిన యంగ్ హీరోయిన్లకు తమ అందచందాలతో పోటీ ఇస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్ పాత్రకు తక్కువ మిగతా అన్ని పాత్రలను పోషించిన అనసూయ సోషల్ మీడియాలో నిత్యం తన అప్డేట్ను అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో అనసూయకు మిలియన్లకు వచ్చి ఫాలోవర్స్ ఉన్నారు. వారిని ఎప్పుడూ సంతోష పరుస్తూ అనసూయ తన పర్సనల్ ఫోటోలు కూడా అప్లోడ్ చేస్తుంది. మొదట్లో అనసూయను ఎవరు పట్టించుకునేవారు కాదు.. కానీ ఇప్పుడు కొన్ని సినిమాల్లో అనసూయ కీలకంగా కనిపిస్తున్నారు. ఆటో స్పెషల్ సాంగ్ లోను కనిపించి అందచందాలతో ఆకట్టుకుంటున్నారు.

దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న అనసూయ ఈ కాలంలో ఎంతో డబ్బు సంపాదించారు. అయితే ఈన్నేళ్లకు ఖరీదైన ఇల్లును కొనుగోలు చేశారు. ఇటీవల అనసూయ కొత్త ఇంట్లోకి కుటుంబంతో వెళ్లిన ఫోటోలను అప్లోడ్ చేశారు. మీ ఇంటికి శ్రీరామ సంజీవని అనే పేరును ఉంచారు. సాంప్రదాయాలకు అనుగుణంగా అనసూయతో పాటు భర్త భరద్వాజ్ పిల్లలు కలిసి ఇంట్లో పాలు పొంగించి సాందని చేశారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచిన అనసూయ’ఆ సీతారామాంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం’అనే క్యాప్షన్ ను ఉంచారు.

ఈ ఫోటోలపై అనసూయ ఫ్యాన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ కొత్త ఇంట్లో మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని కొందరు కామెంట్ చేశారు. అయితే పుష్పటులో కనిపించిన అనసూయ చేతిలో పలు సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ల కంటే ఎక్కువగా బిజీ ఉన్న నటీమణుల్లో అనసూయ ఒకరు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఈమె సందర్భాన్ని బట్టి యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా అనసూయ అప్లోడ్ చేసిన ఫొటోల్లో చాలా సందడిగా కనిపించినట్టు తెలుస్తోంది.
