Operation Sindoor : ఆపరేషన్ సింధూర్.. ప్రపంచ జియో పాలిటిక్స్ లో మార్పు తీసుకొచ్చిందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా చైనా విషయంలో ‘ఆపరేషన్ సింధూర్’తో ప్రపంచం మరొక్కసారి తిరిగి పునరాలోచించే పరిస్థితులను తీసుకొచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ నిన్నటిదాకా ఆల్ మోస్ట్ చైనా కాలనీ కిందనే ఉంది. పూర్తిగా చైనా మీద ఆధారపడి.. చైనా ఏం చెబితే అది చేసే దేశంగా పాక్ ముద్రపడింది.
ఆయుధాలు, ఆర్థికసాయం సహా పూర్తిగా చైనా మీద ఆధారపడిన దేశం ‘పాకిస్తాన్’. ఆ పరిస్థితులను ‘ఆపరేషన్ సింధూర్’తో మార్పు తీసుకొచ్చింది.
చైనా ఇప్పటిదాకా దాని ఆయుధాలు ఎక్కడా టెస్ట్ కాలేదు. అద్భుతంగా అభివృద్ధి అయ్యిందని చెబుతున్న చైనా ఆయుధాలు ఇప్పుడు పాకిస్తాన్ భారత్ పై ప్రయోగిస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. టర్కీ కూడా ఇవే చైనా ఆయుధాలు వాడుతుంది. చైనా ఆయుధాలు భారత్ ను ఏం చేయలేకపోవడంతో ప్రపంచదేశాలకు చైనా సామర్థ్యం అర్థమైపోయింది.
ఆఫ్రికా దేశాలు అమెరికా వద్ద ఎక్కువ రేటు పెట్టి ఆయుధాలు కొనలేవు కాబట్టి ఆఫ్రికా మొత్తం చైనా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఇవాళ ఆఫ్రికా దేశాలకు డౌట్స్ వస్తున్నాయి. పాకిస్తాన్ మిలటరీకి మంచి మిలటరీ గా పేరుంది. అటువంటి పాకిస్తాన్ ఆర్మీ చైనా ఆయుధాలు వాడితే పేలవంగా ఉందని ఇప్పడు అర్థమైంది.
ఆపరేషన్ సిందూర్ తో చైనా ఎందుకు కలవరపడింది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.