Anasuya Bharadwaj: జబర్దస్త్ కి జనాల్లో ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. బుల్లితెర హిస్టరీలో జబర్దస్త్ సంచలనం. ఈ షోకి వచ్చిన రేటింగ్స్ ఎవరూ అందుకోలేని రికార్డులు. జబర్దస్త్ అనగానే మనకు నాగబాబు, రోజా, అనసూయ ముందుగా గుర్తొస్తారు. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ ప్రారంభమైంది. రోజా-నాగబాబు జడ్జెస్ కాగా అనసూయ యాంకర్. ధనాధన్ ధన్ రాజ్, షకలక శంకర్, రోలర్ రఘు, వేణు వండర్స్ మొదట్లో టీమ్స్ గా ఉండేవి. ఈ షో ట్రెమండస్ సక్సెస్ కాగా… అనసూయ అనతికాలంలో ఫేమ్ తెచ్చుకుంది.
అనసూయ గ్లామర్ షోకి మరో ఆకర్షణ. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేయడం అనేది అనసూయతోనే తెలుగు యాంకరింగ్ లో మొదలైంది. దీనిపై విమర్శలు తలెత్తినా అనసూయ పట్టించుకోలేదు. పైగా విమర్శించే వాళ్లకు కౌంటర్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఏళ్ల తరబడి ఆమె జబర్దస్త్ లో కొనసాగింది. స్టార్ యాంకర్ గా ఇతర ఛానల్స్ లో పలు షోలు చేసింది. యాంకర్ గా కొనసాగుతూనే నటిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది.

నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. గత ఏడాది అనసూయ జబర్దస్త్ మానేసింది. అనసూయ యాంకర్ గా రీఎంట్రీ ఇస్తున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు అనసూయ సోషల్ మీడియా చాట్ కారణమైంది. ఒక వేళ నేను తిరిగి యాంకరింగ్ చేయాలంటే మీరు ఏ షో సజెస్ట్ చేస్తారని అడిగింది. ఇందులో అనసూయ మూడు ఆప్షన్స్ ఇచ్చింది.
జబర్దస్త్, డ్రామా జూనియర్స్, మా మహాలక్ష్మి అనే మూడు ఆప్షన్స్ ఇవ్వగా ఏకగ్రీవంగా జబర్దస్త్ కి ఓటేశారు ఆమె ఫ్యాన్స్. 79% మంది ఆమె జబర్దస్త్ లోకి మరలా రావాలని ఓటు వేశారు. దీన్ని బట్టి జబర్దస్త్ ఫ్యాన్స్ ఆమెను ఎంతగా కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ తెగేసి చెప్పింది. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఆమె మనసు మారే అవకాశం లేకపోలేదు. చూడాలి అనసూయ ఏం చేస్తుందో…
View this post on Instagram