Anasuya Bharadwaj: అనసూయను చూస్తే చాలా మందికి అసూయ. ఆమె సక్సెస్ చాలా మంది ఈర్ష్య పడేలా చేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ, గ్లామర్ డాల్ ఇమేజ్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తుందంటే మామూలు విషయం కాదు. అటు బుల్లితెరను, ఇటు వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ… లెక్కకు మించిన ఆఫర్స్ తో రేసుగుర్రంలా కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది.
అనసూయ వేసుకునే బట్టలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఎవరో ఒకరు ఆమె డ్రెస్ సెన్స్ పై కామెంట్ చేయడం, అనసూయ రెచ్చిపోవడం కామన్ గా జరుగుతుంది. నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ గా ఉంటే ఎలాంటి బట్టలైనా వేసుకుంటా.. మీకేంటి బాధ?, అంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఆ మధ్య సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆమె బట్టల పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దానితో చిర్రెత్తిపోయిన అనసూయ… సీనియర్ నటుడు, వయసులో పెద్దవాడని కూడా చూడకుండా ఎడాపెడా ఇచ్చేసింది. అనవసరంగా కదుపుకొని గౌరవం పోగొట్టుకున్నారు కోట. మరి అనసూయతో పెట్టుకుంటే అలానే ఉంటుంది.
ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గేదేలే అంటున్న అనసూయ… తరచుగా హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. తాజాగా టైట్ జీన్స్ , స్ట్రైప్స్ షర్ట్ లో కిరాక్ ఫోజులిచ్చారు. షర్ట్ కి ప్యాంటుకి చిన్న గ్యాప్ ఇచ్చి నడుము అందాల రుచి చూపించింది. మామూలుగానే మనసులు దోచేసే అనసూయను అలా చూసి మగాళ్లు ఊరుకుంటారా.. తోచిన కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు.
Also Read: Hyper Aadi – Raising Raju: హైపర్ ఆది టీమ్ కి అందుకే దూరమయ్యా… రైజింగ్ రాజు కామెంట్స్
ఇక అనసూయ పుష్ప మూవీలో దాక్షాయణి అనే రోల్ చేస్తున్నారు. ఆమె లుక్ అద్భుతంగా ఉంది. అలాగే రవితేజ ఖిలాడి, దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి.
Also Read: Shyam Singaroy: శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి… ఏదో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్