https://oktelugu.com/

Pawan Kalyan : లొకేషన్స్ వేటలో “హరిహర వీరమల్లు” మూవీ యూనిట్…

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే యువత రక్తంలో  తెలియని అభిమానం ఉప్పొంగుతుంది.  ఆయన సినిమాలైనా ఆయన స్పీచ్ అన్న అంత మక్కువ చూపిస్తారు యువత. ఏడాదికో సారి చిత్రం విడుదల చేసిన ఆయన క్రేజ్ ఎప్పటికీ ఒక చెక్కు చెదరని శిల్పంలా  అలానే నిలిచిపోతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ “భీమ్లా నాయక్‌” షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తన తర్వాత సినిమా డైరెక్టర్ క్రిష్ […]

Written By: , Updated On : November 25, 2021 / 07:42 PM IST
Follow us on

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు వింటేనే యువత రక్తంలో  తెలియని అభిమానం ఉప్పొంగుతుంది.  ఆయన సినిమాలైనా ఆయన స్పీచ్ అన్న అంత మక్కువ చూపిస్తారు యువత. ఏడాదికో సారి చిత్రం విడుదల చేసిన ఆయన క్రేజ్ ఎప్పటికీ ఒక చెక్కు చెదరని శిల్పంలా  అలానే నిలిచిపోతుంది. ప్రస్తుతం పవర్ స్టార్ “భీమ్లా నాయక్‌” షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తన తర్వాత సినిమా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్న “హర హర వీరమల్ల”. ఈ సినిమాలో పవర్ స్టార్ చారిత్రక యోధుడుల కనిపించనున్నారు. పవన్ తన ఇన్నేళ్ల సినిమా అనుభవంలో చారిత్రక నేపథ్యంగా తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే.

pawan kalyan hari hara veera mallu movie team looking for new locations

Pawan Kalyan

ఈ సినిమాలో పవర్ స్టార్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో అగ్ర నిర్మాత ఏఎం రత్నం పాన్ ఇండియన్ లెవెల్లో 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని కీలక పాత్ర పాత్రలకు బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ మరియు అర్జున్ రాం పాల్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Shyam Singaroy: శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి… ఏదో ఏదో లిరికల్ సాంగ్ రిలీజ్

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా ఈపాటికే సగ భాగం చిత్రీకరణ పూర్తవ్వాల్సి ఉండగా కొవిడ్ వేవ్స్‌తో పాటు ఇతర కారణాల వల్ల కాస్త అటూ ఇటుగా ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్ళి ఇప్పుడు వీరమల్లు చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురానున్నారు చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో దర్శక, నిర్మాతలు కొత్త లొకేషన్స్‌ను వెతికే పనిలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Also Read: Hyper Aadi – Raising Raju: హైపర్ ఆది టీమ్ కి అందుకే దూరమయ్యా… రైజింగ్ రాజు కామెంట్స్