Fixed Deposit: దేశంలో చాలామంది డబ్బును పొదుపు చేయాలని అనుకుంటున్నారు. ఫిక్స్‌డ్ డిపాజిట్ లలో డబ్బులను ఇన్వెస్ట్ చెయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఎఫ్‌డిలలో ఇవెస్ట్ చేసేవాళ్లు వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలి. ఎస్బీఐ, యాక్సిస్, హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తుండటం గమనార్హం.
మొత్తం డిపాజిట్ కాలవ్యవధి డిపాజిటర్ ను బట్టి వడ్డీరేట్లకు సంబంధించిన మార్పులు ఉంటాయని సమాచారం. ఎస్బీఐ సాధారణ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 2.9 శాతం నుంచి 5.4 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.5 శాతం నుంచి 5.5 శాతం వరకు వడ్డీరేట్లను అందిస్తోంది.
యాక్సిస్ బ్యాంక్ 2.5 శాతం నుంచి 5.75 శాతం వరకు వడ్డీరేటును అందిస్తోంది. కాలపరిమితి ఆధారంగా వడ్డీ రేటు విషయంలో మార్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ మొత్తం వడ్డీని అందిస్తుండటం గమనార్హం. వడ్డీ గురించి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే మాత్రం నష్టపోయే ఛాన్స్ ఉంటుంది.
Also Read: Virus in Kerala: కేరళ రాష్ట్రంలో కొత్తరకం వైరస్.. లక్షణాలు ఏమింటే?
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు అవసరం అయితే లోన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: Online fraud: ఆన్ లైన్ మోసం.. కోటి మాయం