Anasuya Bharadwaj: అనసూయ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. మొదట్లో ఆమె సినిమాల్లో ట్రై చేసింది. హీరోయిన్ కావాలన్న కోరిక నెరవేరకపోవడంతో అనసూయ యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ ఆమె లైఫ్ ఇచ్చింది. 2013లో ప్రయోగాత్మకంగా మొదలైన జబర్దస్త్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. అనసూయ హాట్ గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. జబర్దస్త్ తో పాటు పలు షోలలో అమ్మడు సందడి చేసింది.
గత ఏడాది అనూహ్యంగా యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. జబర్దస్త్ తో పాటు అన్ని షోల నుండి తప్పుకుంది. అనసూయ నిర్ణయం బుల్లితెర ప్రేక్షకులను నిరాశపరిచింది. యాంకరింగ్ మానేసిన అనసూయ యాక్టింగ్ కెరీర్ మూడు పూలు ఆరు కాయలుగా ఉంది. ఈ ఏడాది ఆమె రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో నటించింది. వైవిధ్యమైన పాత్రలు చేసింది.
విమానం చిత్రాల్లో అయితే ఏకంగా అనసూయ వేశ్య రోల్ చేసింది. పుష్ప 2 వంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో అనసూయ నటిస్తుంది. అలాగే మరిన్ని క్రేజీ ఆఫర్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందుకే ఆంటీ అని ట్రోల్ చేస్తుంటారు. కానీ ఆమె అందంలో హీరోయిన్స్ కి పోటీ ఇస్తుంది.
అందుకు కారణం అనసూయ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది. ప్రతి రోజు వ్యాయామం చేస్తుంది. కాగా జిమ్ ఫిట్ లో సూపర్ హాట్ గా ఉన్న అనసూయ ప్రైవేట్ ఫోటో భర్త సుశాంక్ షేర్ చేశాడు. అనసూయ-సుశాంక్ ల ప్రైవేట్ ఫోటో వైరల్ అవుతుంది. కాగా అనసూయ పెద్దలను ఎదిరించి సుశాంక్ ని ప్రేమ వివాహం చేసుకుంది. సుశాంత్ బీహార్ కి చెందినవాడు కాగా.. పెళ్లి ముహూర్తం కుదిరే వరకు అతని కులం, మతం తెలియదని అనసూయ గతంలో కామెంట్స్ చేసింది.