Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ గా అనసూయకు మంచి గుర్తింపే వచ్చింది. ఈ స్టేజీ నుంచే ఆమె సినిమాల్లో అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటోంది. ఇటీవల జబర్దస్త్ కు టాటా చెప్పేసింది. సినిమాలపైనే దృష్టి సారించింది. ఈ మేరకు వరస పెట్టి సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటోంది. జబర్దస్త్ వేదికగా ఉంటే సమయం సరిపోవడం లేదని దానికి గుడ్ బై చెప్పేసింది. షో నుంచి వెళ్లిపోయేటప్పుడు కనీసం కన్నీటి చుక్క కూడా రాల్చలేదు. దీనిపై జబర్దస్త్ టీం లీడర్లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అనసూయలో అంత కఠినత్వం ఉందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు.
అనసూయ ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో ఎలాంటి మొహమాటం చూపించదు. మనసులో ఏమనుకుంటుందో నోటి వెంట అదే వస్తుంది. అందుకే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారు ఎక్కడ కూడా రాణించరు అనే కామెంట్లు ఉన్న సంగతి తెలిసిందే. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక పుష్ప సినిమాలో దాక్షాయణిగా నటించి అందరిని అబ్బుర పరచింది. ఇంకా పుష్ప2లో కూడా ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. దర్జా సినిమాలో లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించింది. ఇంకా రంగ మార్తాండ సినిమాలో కూడా ఓ మంచి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్ లో ఇంకా ఎక్కువ సినిమాల్లో నటించాలని ఆమె ఆశిస్తోంది.
కెమెరా ముందు జీవితం వేరు. కెమెరా వెనుక పరిస్థితి వేరు. ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి. నొక్కితే నొక్కించుకోవాలి అనే హాట్ కామెంట్లు చేసి అనసూయ వార్తల్లో నిలుస్తోంది. ఇన్నాళ్లు మంచి భాషతోనే అందరిని సంబరపెట్టిన ఆమె ఒక్కసారిగా తన పదజాలంలో మార్పు రావడం తెలిసిందే. దీంతో అందరిలో అయోమయం నెలకొంది. ఎందుకింత రాష్ గా మాట్లాడుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఏమైనా అన్నారా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు.
మొత్తానికి సినిమా ఇండస్ట్రీపై తనకున్న ఆవేశాన్ని వెల్లగక్కింది. సినిమాల్లో చాన్సులంటే మాటలు కాదు. దానికి ఎంతో శ్రమ ఉండాలి అనే కామెంట్లు కూడా హీరోయిన్లు చేయడం తెలిసిందే. ఆ మధ్య రష్మిక కూడా తాను హీరోయిన్ ను కావడానికి చాలా ఏళ్లు కష్టపడాల్సి వచ్చిందని చెప్పడం గమనార్హం. దీంతో సినిమా ఇండస్ట్రీ అంటేనే అందరికి భయమే. కానీ ఏవో పాత్రలు చేయాల్సిందే కదా అని దాని కోసం కష్టపడుతుంటారు. తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి నిరంతరం శ్రమిస్తుంటారు.